కరోనాతో మావోయిస్టుల మృతి.. బూటకపు ప్రచారమే
close

ప్రధానాంశాలు

కరోనాతో మావోయిస్టుల మృతి.. బూటకపు ప్రచారమే

సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ

ఈనాడు డిజిటల్‌, జయశంకర్‌ భూపాలపల్లి: కరోనాతో మావోయిస్టులు మృతి చెందుతున్నారనేది పోలీసులు చేస్తున్న బూటకపు ప్రచారమేనని సీపీఐ(మావోయిస్టు) కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్‌ పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కరోనా కట్టడిలో పాలకులు విఫలమయ్యారని, ప్రజల దృష్టిని మళ్లించే చర్యలకు పూనుకుంటున్నారని ఆరోపించారు. అందులో భాగంగానే కరోనాతో మావోయిస్టులు మరణిస్తున్నారంటూ పోలీసులు ప్రచారం చేస్తున్నారని, ఇప్పటి వరకు తమలో ఎవ్వరికీ కొవిడ్‌ సోకలేదన్నారు. అనారోగ్యంతో ఉన్న గంగాలు, శోబ్రాయిలను ఇటీవల అరెస్టు చేసిన పోలీసులు.. వారికి కరోనా సోకినట్లు ప్రచారం చేసి, నాటకీయంగా ఆసుపత్రుల్లో చేర్పించినట్లు చూపి హత్య చేశారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని