ఎఫ్‌ఏఓ ఎస్టీఏబీ సభ్యుడిగా కేశవులు నియామకం
close

ప్రధానాంశాలు

ఎఫ్‌ఏఓ ఎస్టీఏబీ సభ్యుడిగా కేశవులు నియామకం

అభినందించిన మంత్రి నిరంజన్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: ఐక్యరాజ్య సమితికి వ్యవసాయ శాస్త్ర, సాంకేతిక, విధానపరమైన అంశాలలో సలహాలు సూచనలు ఇచ్చే అనుబంధ విభాగం ‘ప్రపంచ ఆహార సంస్థ’ (ఎఫ్‌ఏఓ) ఏర్పాటుచేసిన అంతర్జాతీయ ‘శాస్త్ర సాంకేతిక సలహా మండలి’ (ఎస్టీఏబీ) సభ్యుడిగా తెలంగాణ రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ సంచాలకుడు డాక్టర్‌ కేశవులు నియమితులయ్యారు. ఈ నియామకం రాష్ట్రానికే కాకుండా యావత్‌ భారతదేశానికి గర్వకారణమని, అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ విత్తన రంగానికి గుర్తింపు రావడానికి ఉపయోగపడుతుందని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన బుధవారం తన నివాసంలో కేశవులును అభినందించారు. తెలంగాణను విత్తన భాండాగారంగా అభివృద్ధి చేయడానికి, అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తానని కేశవులు చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని