మాకూ వేతనాలు పెంచండి
close

ప్రధానాంశాలు

మాకూ వేతనాలు పెంచండి

వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల మొర

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం జూనియర్‌ కళాశాలల కాంట్రాక్టు అధ్యాపకులకు కొత్త పీఆర్‌సీ ప్రకారం బేసిక్‌ పే వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించడంతో వారి వేతనాలు వర్సిటీ అధ్యాపకులకన్నా ఎక్కువయ్యాయి. అలా తమకూ ఏడో కేంద్ర వేతన సంఘం ప్రకారం జీతాలు పెంచాలని వర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకుల సంఘాలు కోరుతున్నాయి. ఇప్పటికే రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డికి వినతిపత్రాలు సమర్పించాయి. ఉన్నత విద్యామండలి అధికారులు దీనిపై ఇటీవల విద్యాశాఖ మంత్రితోనూ చర్చించారు.
ఉన్నత విద్యాశాఖ పరిధిలో రాష్ట్రంలో 11 విశ్వవిద్యాలయాలుండగా మొత్తం 1,335 మంది కాంట్రాక్టు అధ్యాపకులు పనిచేస్తున్నారు. వారిలో 700 మందికి పీహెచ్‌డీ/జాతీయ అర్హత పరీక్ష(నెట్‌)/ రాష్ట్ర అర్హత పరీక్ష(సెట్‌) అర్హతలున్నాయి. కొత్త పీఆర్‌సీ అమలు చేస్తుండటం, రెగ్యులర్‌ ఆచార్యులకు ఏడో కేంద్ర వేతన సంఘం ప్రకారం పెంచితే బేసిక్‌, డీఏ కలిపి రూ.67,509 అవుతుందని, మొత్తం ఏడాదికి రూ.40 కోట్లు మాత్రమే అదనపు భారం పడుతుందని తెలంగాణ ఆల్‌ యూనివర్సిటీస్‌ కాంట్రాక్టు టీచర్స్‌ అసోసియేషన్‌ నేత రామేశ్వర్‌రావు చెప్పారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని