జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి మార్గం సుగమం

ప్రధానాంశాలు

జేఎల్‌ఎం పోస్టుల భర్తీకి మార్గం సుగమం

ఈనాడు,హైదరాబాద్‌: టీఎస్‌ ట్రాన్స్‌కోలో జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి మార్గం సుగమమైంది. తెలంగాణ ఉమ్మడి జిల్లాల పరిధిలో 1100 జూనియర్‌ లైన్‌మెన్‌ పోస్టుల భర్తీకి 2017లో నోటిఫికేషన్‌ ఇచ్చారు. రాతపరీక్ష, ఇంటర్వ్యూల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయాలని... ఇన్‌సర్వీసులో ఉన్న వారికి ఏడాదికి రెండు మార్కుల వంతున ఇవ్వాలని, గరిష్ఠంగా పదేళ్లను పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించారు. దీనిని వ్యతిరేకిస్తూ కొందరు కోర్టును ఆశ్రయించారు. కొన్నేళ్లుగా కోర్టుల పరిధిలో ఉన్న ఈ వ్యవహారం కొలిక్కి వచ్చింది. ఇన్‌సర్వీసులో ఉన్నవారికి వెయిటేజి సమంజసమేనని కోర్టు తీర్పునిచ్చింది. ఈ పోస్టుల భర్తీకి త్వరితగతిన చర్యలు చేపట్టాలని, ఆగస్టు నెలాఖరులోగా పూర్తిచేయాలని తెలంగాణ విద్యుత్‌ ఉద్యోగుల 1104 యూనియన్‌ అధ్యక్ష, కార్యదర్శులు పద్మారెడ్డి, ఎన్‌.సాయిబాబు విజ్ఞప్తి చేశారు. బుధవారం వారు తెలంగాణ ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకరరావు, జేెఎండీ శ్రీనివాసరావులను కలిసి  ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. కోర్టు ఉత్తర్వులు అధికారికంగా అందిన వెంటనే ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని