హైదరాబాద్‌లో సినారె సారస్వత సదనం

ప్రధానాంశాలు

హైదరాబాద్‌లో సినారె సారస్వత సదనం

జ్ఞానపీఠ్‌ పురస్కార గ్రహీతకు ముఖ్యమంత్రి నివాళులు

ఈనాడు, హైదరాబాద్‌: జ్ఞానపీఠ్‌ అవార్డు పురస్కార గ్రహీత సి.నారాయణరెడ్డి జయంతి సందర్భంగా సీఎం కేసీఆర్‌ బుధవారం ఆయనకు ఘన నివాళులు అర్పించారు. తెలుగు సాహిత్యాన్ని విశ్వవ్యాప్తం చేసిన సినారె, తెలుగు భాష, తెలంగాణ సాంస్కృతిక రంగానికి చేసిన సేవ చిరస్మరణీయమని అన్నారు. ఆయన సాహితీ సేవకు గుర్తుగా హైదరాబాద్‌లో సినారె సారస్వత సదనం నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు ప్రారంభించిందని పేర్కొన్నారు. కవిగా, సినీ గీతాల రచయితగా, పలు సాహితీ ప్రక్రియలను కొనసాగించి తెలుగు సాహిత్యాన్ని సమున్నతం చేశారని, జల్‌ వంటి ఉర్దూ సాహితీ సంప్రదాయానికి గౌరవమిచ్చి, తెలంగాణ సాహిత్యాన్ని గంగాజమునా తెహజీబ్‌కు ప్రతీకగా నిలిపారని కేసీఆర్‌ తన సందేశంలో పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యునిగా, వివిధ విశ్వవిద్యాలయాలకు ఉపకులపతిగా పనిచేసి ఆ పదవులకు వన్నె తెచ్చారన్నారు.Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని