మాస్కులపై నిర్లక్ష్యం వద్దు

ప్రధానాంశాలు

మాస్కులపై నిర్లక్ష్యం వద్దు

సీసీఎంబీ విశ్రాంత సంచాలకుడు సీహెచ్‌.మోహన్‌రావు

ఈనాడు, హైదరాబాద్‌: ప్రజలు నిర్లక్ష్యంగా ఉంటే కరోనా మూడో దశ వస్తుందని.. దీని నివారణకు అందరూ తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సీసీఎంబీ విశ్రాంత సంచాలకుడు డాక్టర్‌ సీహెచ్‌.మోహన్‌రావు పేర్కొన్నారు. భారత జాతీయ సైన్సెస్‌ అకాడమీ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన వెబినార్‌లో ఆయన మాట్లాడారు. పలువురు శాస్త్రవేత్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర మాజీ కార్యదర్శి డాక్టర్‌ మంజు శర్మ మాట్లాడుతూ కరోనా విపత్తులో శాస్త్రవేత్తలు కీలకపాత్ర పోషించాలన్నారు. అకాడమీ అధ్యక్షుడు అజోయ్‌ ఘోష్‌ మాట్లాడుతూ వ్యాక్సిన్‌ కార్యక్రమానికి ప్రాధాన్యమివ్వాలన్నారు. జాతీయ పోషకాహార సంస్థ బయోకెమిస్ట్రీ విభాగం అధిపతి డాక్టర్‌ భానుప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో విటమిన్లది కీలకపాత్ర అన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని