11 కొత్త వంగడాల విడుదల

ప్రధానాంశాలు

11 కొత్త వంగడాల విడుదల

ఈనాడు, హైదరాబాద్‌: ఆచార్య జయశంకర్‌ వర్సిటీ రూపొందించిన 11 కొత్త వంగడాలను ఉపకులపతి(వీసీ) వి.ప్రవీణ్‌రావు గురువారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులకు వివరాలు వెల్లడించారు. సోయాచిక్కుడులో ప్రస్తుతం జేఎస్‌-335 రకం వంగడం అధికంగా పండిస్తున్నారని... దానికన్నా 10 శాతం అధిక దిగుబడినిచ్చే ‘ఆదిలాబాద్‌ ఇండోర్‌ సోయాచిక్కుడు-1’ రకం విత్తనాలను తాజాగా విడుదల చేశామన్నారు. వరిలో చౌడును తట్టుకుని అధిక దిగుబడినిచ్చే రెండు మధ్యకాలిక రకాలు, మరో రెండు సువాసన ఉండే పొడవు గింజ రకం, స్వల్పకాలిక సన్న రకం విడుదల చేసినట్లు ఆయన వివరించారు. గత ఏడేళ్లలో 47 రకాల వంగడాలను విడుదల చేశామన్నారు. ఇక్రిశాట్‌, అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ వంటి వాటితో ఒప్పందాలు చేసుకుని పలు రకాల జన్యువులను తీసుకుని కొత్త వంగడాలను రూపొందిస్తున్నామన్నారు. ప్రైవేటు కళాశాలల్లో వ్యవసాయ డిగ్రీ కోర్సులకు ఐసీఏఆర్‌ అక్రిడిటేషన్‌ తప్పనిసరి అన్నారు. పరిశోధన సంచాలకుడు డాక్టర్‌ జగదీశ్వర్‌, విత్తన విభాగం సంచాలకుడు ప్రదీప్‌కుమార్‌ పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని