అడ్మిషన్‌ రిజిస్టర్‌లో మార్పులెందుకున్నాయ్‌?

ప్రధానాంశాలు

అడ్మిషన్‌ రిజిస్టర్‌లో మార్పులెందుకున్నాయ్‌?

  త్రిసభ్య కమిషన్‌లో ప్రధానోపాధ్యాయుడి విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: రంగారెడ్డి జిల్లా చటాన్‌పల్లి ఎన్‌కౌంటర్‌పై జస్టిస్‌ సిర్పుర్కర్‌ నేతృత్వంలోని త్రిసభ్య కమిషన్‌ విచారణ కొనసాగుతోంది. ఎన్‌కౌంటర్‌ మృతుల్లో ఒకరైన చెన్నకేశవులు విద్యనభ్యసించిన గుడిగండ్ల ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నర్సింహులును స్టేట్‌ కౌన్సిల్‌ సురేందర్‌రావు బుధవారం విచారించారు. పాఠశాల అడ్మిషన్‌ రిజిస్టర్‌లో పలు చోట్ల కొట్టివేతలు, మార్పులు ఎందుకు ఉన్నాయని ప్రశ్నించారు. ధ్రువీకరణ పత్రాలను జారీ చేసేటప్పుడు కొన్ని సందర్భాల్లో ఇలాంటి మార్పులు సహజంగానే ఉంటాయని బదులిచ్చారు. ఆ సమయంలో పనిచేసిన ప్రధానోపాధ్యాయుల సంతకం కూడా తప్పనిసరిగా ఉంటుందని చెప్పారు. రిజిస్టర్‌లోనూ అప్పటి ప్రధానోపాధ్యాయుల సంతకాలు ఉన్నాయని పేర్కొన్నారు.  శివ, నవీన్‌ల కుటుంబ సభ్యులను కూడా విచారించే అవకాశముంది.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని