ఆర్టీసీ నష్టాలను ఎంతకాలం భరిస్తాం?

ప్రధానాంశాలు

ఆర్టీసీ నష్టాలను ఎంతకాలం భరిస్తాం?

ఉత్తరాది రాష్ట్రాలు ఇప్పటికే చేతులెత్తేశాయన్న బాజిరెడ్డి గోవర్ధన్‌

ఈనాడు, హైదరాబాద్‌: నష్టాలు ఏటేటా పెరుగుతున్నాయని.. ప్రభుత్వం ఎంతమేరకని భరిస్తుందని ఆర్టీసీ ఛైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అన్నారు. నష్టాలు పెచ్చుమీరటంతోనే ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రభుత్వాలు చేతులెత్తేసిన విషయం మర్చిపోకూడదని చెప్పారు. ఆర్టీసీని ఆదుకునేందుకు ప్రభుత్వం కొన్నేళ్లుగా సాయం చేస్తోందని.. అయినా పరిస్థితిలో మార్పు లేదని పేర్కొన్నారు. సింహభాగం నష్టాలు డీజిల్‌ ధర పెరగడంతోనే వస్తున్నాయన్నారు. బుధవారం  ఆయన ‘ఈనాడు’తో మాట్లాడుతూ.. ‘‘ఆర్టీసీని గాడిలో పెట్టాలని ముఖ్యమంత్రి కృతనిశ్చయంతో ఉన్నారు. నష్టాలను కట్టడి చేయకపోతే మూసివేయాల్సిన పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.  రవాణా సంస్థ అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. లాభాలకు మార్గాలను అన్వేషించాలి. అందరం కలసికట్టుగా ముందుకు సాగాలి. నష్టాల నుంచి బయటపడేందుకు ఛార్జీల పెంపుదల ఒక మార్గం. ఆర్థికంగా ముందడుగు వేసే అంశాలపై త్వరలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ఎండీ సజ్జనార్‌లతో కలసి ప్రణాళిక రూపొందిస్తాం. అధికారులతో సమన్వయం చేసుకుంటూ లాభాల బాటలో నడిచేందుకు చర్యలు తీసుకుంటాం’’ అని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని