తాడిచర్ల బొగ్గును భూపాలపల్లిలోనే వినియోగించాలి: వినోద్‌కుమార్‌

ప్రధానాంశాలు

తాడిచర్ల బొగ్గును భూపాలపల్లిలోనే వినియోగించాలి: వినోద్‌కుమార్‌

ఈనాడు, హైదరాబాద్‌: తాడిచర్లలోని సింగరేణి బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించవద్దని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ డిమాండ్‌ చేశారు. దానిని భూపాలపల్లిలోని విద్యుదుత్పత్తి కేంద్రం కోసమే వినియోగించాలని సూచించారు. తాడిచర్ల బొగ్గును ఇతర రాష్ట్రాలకు తరలించాలని సింగరేణి అధికారులను కేంద్ర పెద్దలు మౌఖికంగా ఆదేశించారని, ఇది సరికాదని అభ్యంతరం తెలిపారు. భూపాలపల్లిలో విద్యుత్‌ ఉత్పత్తికి విఘాతం కలిగించవద్దని కోరారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని