ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

ప్రధానాంశాలు

ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే

ఆర్కే మృతిపై భార్య శిరీష

టంగుటూరు, న్యూస్‌టుడే: పేదలకు న్యాయం చేకూర్చే విషయంలో 40 ఏళ్లు ఆర్కే అలుపెరగని పోరాటం చేశారని ఆయన భార్య శిరీష విలపిస్తూ చెప్పారు. కుమారుడినీ ఉద్యమానికే అంకితం చేశారన్నారు. ఆర్కే మరణవార్తను పార్టీ ధ్రువీకరించాక.. శిరీష, కుటుంబసభ్యులు భోరున విలపించారు. ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం ఆలకూరపాడులోని నివాసం వద్దకు గ్రామస్థులు, సంఘాల ప్రతినిధులు చేరుకున్నారు. ఈ సందర్భంగా శిరీష విలేకర్లతో మాట్లాడుతూ ‘సమాజం ఉన్నతంగా ఉండాలని ఆర్కే కోరుకునేవారు. ఆరోగ్యాన్ని పట్టించుకోకుండా నిత్యం ప్రజల కోసమే పనిచేశారు. ఆయనది సహజ మరణం కాదు, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యే. దండకారణ్యాన్ని పోలీసులు చుట్టుముట్టి సరైన వైద్యం అందకుండా చేశారు. మెరుగైన చికిత్స అందితే ఆర్కే బతికేవారు. మావోయిస్టులకు తీసుకువెళ్లే ఆహార పదార్థాల్లో పోలీసులు విషం కలుపుతున్నారు’ అని ఆమె చెప్పారు. ఆర్కే ప్రజల మనిషని, వారి కోసమే ఆయన అమరుడయ్యారని విరసం నేత కల్యాణ్‌రావు అన్నారు. విరసం రాష్ట్ర అధ్యక్షుడు అరసవెల్లి కృష్ణ, సభ్యులు పినాకపాణి, రివేరా తదితరులు శిరీషను పరామర్శించారు. ఆర్కే మరణం విప్లవోద్యమాని తీవ్రనష్టమని సీపీఐ(ఎం.ఎల్‌)జనశక్తి రాష్ట్ర కమిటీ నేత విశ్వనాథ్‌ అన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని