హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ రోగులకు ప్రత్యేక రక్తశుద్ధి కేంద్రాలు

ప్రధానాంశాలు

హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ రోగులకు ప్రత్యేక రక్తశుద్ధి కేంద్రాలు

హైదరాబాద్‌, వరంగల్‌లో ఏర్పాటు

వైద్య మంత్రి హరీశ్‌రావు ఆదేశాలు

ఈనాడు, హైదరాబాద్‌: మూత్రపిండాల వైఫల్యంతో బాధపడుతున్న హెచ్‌ఐవీ, హెపటైటిస్‌ రోగులకు ఉచిత రక్తశుద్ధి(డయాలసిస్‌) సేవలు అందించాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. వీరి కోసం ప్రత్యేకంగా హైదరాబాద్‌, వరంగల్‌ నగరాల్లో ఒక్కొక్కటి చొప్పున రక్తశుద్ధి కేంద్రాలను నెలకొల్పాలని సూచించారు. రెండు కేంద్రాల్లోనూ ఐదు పడకలు హెచ్‌ఐవీ రోగులకు, మరో ఐదు హెపటైటిస్‌ రోగుల కోసం కేటాయించాలన్నారు. ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ ప్రధాన కార్యాలయంలో బుధవారం ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షలో ఈ మేరకు మంత్రి ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు కూడా ఈహెచ్‌ఎస్‌ పథకం కింద ప్రభుత్వ ఆసుపత్రుల్లోని 43 రక్తశుద్ధి కేంద్రాల్లో ఉచిత సేవలు అందించాలని మంత్రి మార్గదర్శకాలిచ్చారు. ఎక్కడ రోగుల తాకిడి ఎక్కువగా ఉంటుందో గుర్తించి, ఆయా కేంద్రాల్లో కొత్త పరికరాలను ఏర్పాటుచేసేందుకు అనుగుణంగా ప్రతిపాదనలు రూపొందించాలని ఉన్నతాధికారులకు సూచించారు. సమీక్షలో ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ, ఔషధ నియంత్రణ సంస్థ సంచాలకులు ప్రీతిమీనా, వైద్యవిద్య సంచాలకులు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని