close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
రైతుబీమాకు సీఎం ఆమోదం

వ్యవసాయశాఖకు రూ.1173 కోట్ల విడుదల
అన్నదాతల పక్షాన సీఎంకు ధన్యవాదాలు తెలిపిన మంత్రి నిరంజన్‌

ఈనాడు, హైదరాబాద్‌ : రైతుబీమా పథకాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిధుల విడుదలకు సోమవారం సీఎం కేసీఆర్‌ ఆమోదం తెలిపారని వ్యవసాయశాఖ మంత్రి ఎస్‌.నిరంజన్‌రెడ్డి ప్రకటించారు. కరోనా సంక్షోభంలోనూ ఈ పథకాన్ని కొనసాగిస్తూ రూ.1173.54 కోట్లను విడుదల చేసినందుకు రాష్ట్ర రైతులందరి తరఫున ఆయన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు. ఈ నెల 14 నుంచి 2021 ఆగస్టు 13 వరకూ రాష్ట్రంలో 18 నుంచి 59 ఏళ్లలోపు 32.73 లక్షల మంది రైతులకు జీవితబీమా కల్పించడమే ఈ పథకం ఉద్దేశమన్నారు. 1961 ఆగస్టు 14 నుంచి 2002 ఆగస్టు 14 మధ్య పుట్టిన రైతులు ఈ పథకం కింద అర్హులు. కానీ, వీరి భూములకు ఇప్పటికే రెవెన్యూశాఖ కొత్త పట్టాదారు పాసుపుస్తకం ఇచ్చి ఉండాలి. ఒకవేళ ఇవ్వకపోయినా ఆన్‌లైన్‌లో పుస్తకం జారీకి తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం చేసి ఉండాలి. పథకంలో పేర్లు నమోదైన రైతు ఏదైనా కారణంతో కన్నుమూస్తే అతని కుటుంబానికి ‘భారత జీవిత బీమా సంస్థ’(ఎల్‌ఐసీ) రూ.5లక్షల పరిహారాన్ని అందజేస్తుంది. ఈ క్రమంలో ఒక్కో రైతు తరఫున ప్రీమియం కింద రూ.3486.90 చొప్పున మొత్తం  రైతుల నుంచి రూ.1141 కోట్లు, జీఎస్టీ కింద మరో రూ.32.54 కోట్లు కలిపి మొత్తం రూ.1173.54 కోట్లు వ్యవసాయశాఖకు విడుదల చేశారు. తొలుత 2018 ఆగస్టు 14న ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. అప్పటి నుంచి సోమవారం వరకూ దాదాపు రెండేళ్లలో 34,267 మంది రైతులు కన్నుమూశారు. వీరిలో 32267 మంది కుటుంబాలకు ఎల్‌ఐసీ రూ.1613.35 కోట్ల పరిహారాన్ని అందజేసింది. మరో 1800 మంది కుటుంబాలకు రూ.90 కోట్ల చెల్లించాల్సి ఉంది. దళారులు లేకుండా నేరుగా రైతుల కుటుంబాలకు ఎల్‌ఐసీ పరిహారం ఇచ్చేలా ఈ పథకాన్ని కేసీఆర్‌ రూపొందించినట్లు మంత్రి నిరంజన్‌రెడ్డి తెలిపారు.

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.