ఇక్కడ వధూవరులు.. అక్కడ పూజారి..
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

ఇక్కడ వధూవరులు.. అక్కడ పూజారి..

మానవ జీవితంలో ఎన్నో మార్పులకు కారణభూతమైన కరోనా వైరస్‌.. పెళ్లి వేడుకలోనూ కొత్త విధానాలకు ఆవాహన పలికింది. పంతులుగారు దగ్గరుండి మంత్రాలు చదువుతూ.. నిర్వహించే పెళ్లి వేడుక స్థానంలో ‘అక్కడ పూజారి.. ఇక్కడ అబ్బాయి-అమ్మాయి’ అంటూ వీడియోకాల్‌ ద్వారా నిర్వహించే సంప్రదాయం వచ్చేసింది. మెదక్‌ జిల్లా పాపన్నపేట మండలం సోంలా తండాకు చెందిన మంజులకు.. టేక్మాల్‌ మండలం బీంలా తండాకు చెందిన మోహన్‌కు ఇచ్చి ఈ నెల 3న పెళ్లి చేసేందుకు ముహూర్తం నిర్ణయించారు. సోంలా తండాలో ఈ నెల 2న ఓ వ్యక్తి కరోనాతో మృతి చెందడంతో అక్కడ పెళ్లి చేయడానికి పాపన్నపేటకు చెందిన పురోహితుడు దిగంబరాచార్యులు నిరాకరించారు. ఈ క్రమంలో వారంతా చర్చించుకొని అదే రోజు ప్రత్యామ్నాయ మార్గంలో వివాహం చేసేందుకు ముందుకొచ్చారు. వివాహ వేదికను బీంలా తండాకు మార్చారు. పురోహితుడు తన ఇంటి నుంచి చరవాణిలో వీడియో కాల్‌ ద్వారా పెళ్లి మంత్రాలు చదవగా.. అది వింటూ వధూవరులు పెళ్లి తంతు పూర్తి చేశారు.  

- న్యూస్‌టుడే, టేక్మాల్‌, మెదక్‌ టౌన్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు