పరిమాణం పక్షంత.. పస్తులే బతుకంతా!
close

ప్రధానాంశాలు

పరిమాణం పక్షంత.. పస్తులే బతుకంతా!

విశాఖ మన్యంలోని చింతపల్లిలో బుధవారం ఓ భారీ సీతాకోక చిలుక కనిపించింది. రెక్కలు విచ్చుకున్నప్పుడు 24 సెంటీమీటర్ల వెడల్పు ఉంది. భిన్నమైన రంగులతో ఆకట్టుకుంటున్న దీని రెక్కల చివరలు పాము తల ఆకారంలో ఉన్నాయి. దీన్ని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త సీతారాం దృష్టికి తీసుకెళ్లగా.. సీతాకోక చిలుకల సంతతికి చెందినదే అయినా దీన్ని ‘అట్లాస్‌ మోత్‌’ అని పిలుస్తారని తెలిపారు. పక్షి అంత పరిమాణంలో పెరుగుతుందని, ఆకారం పెద్దగా ఉన్నా దీనికి నోరు ఉండదన్నారు. ఆహారం తీసుకోకుండా 2 వారాలు బతుకుతుందని పేర్కొన్నారు.

- న్యూస్‌టుడే, చింతపల్లి


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని