నువ్వు కాల్చినా.. నేను చిగురించనా..?.
close

ప్రధానాంశాలు

నువ్వు కాల్చినా.. నేను చిగురించనా..?.

చిత్రంలోని చెట్టు సగభాగం ఆకుపచ్చ, మరో సగభాగం ఎరుపు రంగుతో భలేగా కనిపిస్తోంది కదూ.. నిజానికి అవి ప్రకృతిసిద్ధంగా వచ్చిన రంగులు కావు. కొందరు ఆకతాయిలు పచ్చని చింత చెట్టుకు నిప్పు పెట్టడంతో సగభాగం ఆకులు, కొమ్మలు కాలిపోయాయి. అయినా చెట్టు కాండం ఎండిపోకుండా చిగురిస్తూ.. ఇలా ఎరుపు, పచ్చ రంగులతో దర్శనమిస్తూ చూపరులను ఆకట్టుకుంటోంది. వనపర్తి జిల్లా ఖిల్లాగణపురం మండల కేంద్రం నుంచి మామిడిమాడ గ్రామానికి వెళ్లే దారిలోని పొలాల్లో ఈ చిత్రం ‘ఈనాడు’ కెమెరాకు చిక్కింది.

- ఈనాడు, మహబూబ్‌నగర్‌


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని