క్యాన్సర్‌ టీకాలకు ఈ ప్రొటీన్లే లక్ష్యం

ప్రధానాంశాలు

క్యాన్సర్‌ టీకాలకు ఈ ప్రొటీన్లే లక్ష్యం

వాషింగ్టన్‌: క్యాన్సర్‌ టీకాల అభివృద్ధి దిశగా అమెరికా శాస్త్రవేత్తలు ముందడుగు వేశారు. ఇందుకు దోహదపడే కీలక ప్రొటీన్లను గుర్తించారు. వాటిని లక్ష్యంగా చేసుకొని ఈ రుగ్మతకు సమర్థ వ్యాక్సిన్లను అభివృద్ధి చేయవచ్చని తేల్చారు. క్యాన్సర్‌పై పోరు కోసం టీకాలను సాధనంగా వాడుకునేందుకు దశాబ్ద కాలంగా శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ప్రయోగాత్మకంగా కొన్ని వ్యాక్సిన్లను కూడా అభివృద్ధి చేశారు. కణితిని లక్ష్యంగా చేసుకొని శరీర రోగ నిరోధక వ్యవస్థను ప్రేరేపించేలా వీటిని రూపొందించారు. అయితే ఈ వ్యాక్సిన్లలో ఒక్కదానికీ అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) నుంచి అనుమతి లభించలేదు. ఈ నేపథ్యంలో టీకాల రూపకల్పనకు దోహదపడే కొన్ని క్యాన్సర్‌ ప్రొటీన్లను మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎంఐటీ) శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిని నియోయాంటిజెన్లుగా పేర్కొంటున్నారు. ఇవి ఆరోగ్యకరమైన కణాల్లో ఉండవు. వీటిని లక్ష్యంగా చేసుకొని టీకాలు అభివృద్ధి చేయవచ్చని శాస్త్రవేత్తలు చెప్పారు. ఆ వ్యాక్సిన్లు.. శరీర రోగ నిరోధక వ్యవస్థలోని ‘టి కణాల’ స్పందనను అవసరమైన రీతిలో ప్రేరేపిస్తాయని తెలిపారు. తద్వారా కణతుల పరిమాణం తగ్గిపోయేలా చూస్తాయన్నారు. ఈ మేరకు ఎలుకలపై నిర్వహించిన ప్రయోగాల్లో వెల్లడైనట్లు పేర్కొన్నారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని