close

కల్యాణరాముడికి... ఆరగింపు!

సీతారామ కల్యాణం పూర్తయ్యాక ఇచ్చే పానకం, వడపప్పు ఎంత రుచిగా ఉంటాయో చెప్పక్కర్లేదు. గుళ్లల్లోనే కాదు, ఇంట్లోనూ వీటిని చేసుకోవడం మామూలే అయినా...  శ్రీరామనవమి అంటే ఈ రెండే కాదుగా... అందుకే ఈసారి ఆ కల్యాణరాముడికి మరికొన్ని పదార్థాలూ నైవేద్యంగా పెడదాం రండి.


మిరియాల అన్నం

కావలసినవి
పొడిపొడిగా వండిన అన్నం: ఒకటిన్నర కప్పు, నెయ్యి: రెండు టేబుల్‌స్పూన్లు, మిరియాల పొడి: రెండు చెంచాలు, జీడిపప్పు పలుకులు: పావుకప్పు, కరివేపాకు రెబ్బలు: రెండు, పచ్చిమిర్చి: ఒకటి, సెనగపప్పు: రెండు చెంచాలు, ఎండుమిర్చి: ఒకటి, జీలకర్ర: చెంచా, ఉప్పు: చిటికెడు
తయారుచేసే విధానం
* స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక సెనగపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, జీడిపప్పు పలుకులూ వేయించుకోవాలి. అన్నీ వేగాక పచ్చిమిర్చి తరుగు, కరివేపాకూ వేయించి... అన్నం, తగినంత ఉప్పు, మిరియాలపొడి వేసి బాగా కలపాలి. రెండు
నిమిషాలయ్యాక దింపేయాలి.


పుట్నాల లడ్డు

కావలసినవి
పుట్నాలపప్పు: కప్పు, బెల్లం తరుగు: అరకప్పు, నెయ్యి: అరకప్పు, యాలకులపొడి: అరచెంచా, ఎండుకొబ్బరిపొడి: మూడు టేబుల్‌స్పూన్లు, వేయించిన నువ్వులు: మూడు టేబుల్‌స్పూన్లు, పల్లీలు: రెండు టేబుల్‌స్పూన్లు, గసగసాలు: టేబుల్‌స్పూను.
తయారుచేసే విధానం
* స్టౌమీద బాణలి పెట్టి పుట్నాలపప్పును దోరగా వేయించుకుని తీసుకోవాలి. అదే బాణలిలో పల్లీలు, గసగసాలను కూడా వేయించుకుని తీసుకోవాలి. పల్లీల పొట్టు తీసుకుని... గసగసాలు, నువ్వులు, పుట్నాలపప్పు, కొబ్బరితో కలిపి పొడిలా చేసుకోవాలి. స్టౌపైన బాణలి పెట్టి, నెయ్యి వేయాలి. అది కరిగాక బెల్లం తరుగు వేసి ఓసారి కలపాలి. అది కరిగి, బుడగల్లా వస్తున్నప్పుడు పుట్నాలపప్పు మిశ్రమాన్నీ యాలకులపొడినీ కూడా వేసి బాగా కలిపి స్టౌ కట్టేయాలి. ఇది కొద్దిగా వేడి తగ్గాక లడ్డూల్లా చేసుకుంటే సరి.


అటుకుల దద్ధ్యోదనం

కావలసినవి
కాస్త మందంగా ఉండే అటుకులు: అరకప్పు, పెరుగు: అరకప్పు, సన్నగా తరిగిన కీరదోస ముక్కలు: పావుకప్పు, తాజా కొబ్బరితురుము: రెండు టేబుల్‌స్పూన్లు, దానిమ్మగింజలు: రెండు టేబుల్‌స్పూన్లు, చక్కెర: పావుచెంచా, పుట్నాలపప్పు: రెండు చెంచాలు, కొత్తిమీర తరుగు: రెండు టేబుల్‌స్పూన్లు, నెయ్యి: చెంచా, జీలకర్ర: అరచెంచా, అల్లం తరుగు: అరచెంచా, పచ్చిమిర్చి: ఒకటి, ఇంగువ: చిటికెడు, ఉప్పు: తగినంత.
తయారుచేసే విధానం
* అటుకుల్ని ఒకట్రెండుసార్లు కడిగి... నీళ్లు పిండేసి ఓ గిన్నెలోకి తీసుకోవాలి. వాటిపైన పెరుగు, కీరదోస ముక్కలు, పుట్నాలపప్పు, కొత్తిమీర తరుగు, తగినంత ఉప్పు, దానిమ్మగింజలు, చక్కెర, తాజా కొబ్బరితురుము వేసి అన్నింటినీ బాగా కలపాలి. స్టౌమీద బాణలి పెట్టి నెయ్యి వేయాలి. అది కరిగాక అల్లం, పచ్చిమిర్చి తరుగు, ఇంగువ, జీలకర్ర వేయించి అటుకులపైన వేసి కలపాలి.


పెసరబూరెలు

కావలసినవి
పెసరపప్పు: కప్పు (రెండు గంటలసేపు నానబెట్టుకోవాలి), చక్కెరపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, కొబ్బరిపొడి: రెండు టేబుల్‌స్పూన్లు, యాలకులపొడి: చెంచా, బియ్యం: కప్పు, మినప్పప్పు: కప్పు, ఉప్పు: చిటికెడు, నూనె: వేయించేందుకు సరిపడా, నెయ్యి: చెంచా.
తయారుచేసే విధానం
* బియ్యం, మినప్పప్పును అయిదారుగంటల ముందు నానబెట్టుకుని మెత్తగా రుబ్బి ఉప్పు కలిపి పెట్టుకోవాలి. పెసరపప్పులో నీళ్లు వంపేసి మిక్సీజారులోకి తీసుకుని మెత్తగా గ్రైండ్‌ చేసుకోవాలి. దీన్ని నెయ్యి రాసిన ఇడ్లీ రేకులపై వేసుకుని ఆవిరిమీద పదినిమిషాలు ఉడికించుకుని తీసేయాలి. చల్లారాక పొడిలా చేసుకోవాలి. స్టౌమీద పాన్‌పెట్టి చక్కెరపొడి, కొబ్బరిపొడి, పెసరపొడి, యాలకులపొడి వేయాలి. మధ్యమధ్య కలుపుతూ ఉంటే.. అయిదు నిమిషాలకు ముద్దలా అవుతుంది. అప్పుడు దింపేసి చిన్నచిన్న ఉండల్లా చుట్టుకోవాలి. స్టౌమీద కడాయి పెట్టి వేయించేందుకు సరిపడా నూనె పోయాలి. అది వేడయ్యాక ఒక పెసర ఉండను తీసుకుని బియ్యప్పిండిలో ముంచి నూనెలో వేయాలి. ఎర్రగా వేగాక తీసేయాలి. ఇదేవిధంగా అన్నీ చేసుకుని నెయ్యి వేసుకుని తింటే.. చాలా రుచిగా ఉంటాయి.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు
+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers
Terms & Conditions   |   Privacy Policy
Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.