close
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share
సినిమా పజిల్‌

 


సినిమా పాయింట్‌

లాక్‌డౌన్‌తో ఇప్పటివరకూ సినిమాలు తెగ చూసేశాం కదా... వాటి చిత్రీకరణ వెనుకా, నటీనటుల జీవితాల్లోనూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉంటాయి. వాటి గురించి తెలుసుకున్నప్పుడు ‘అవునా... అలా జరిగిందా’ అనిపించకమానదు. అలాంటివే ఈ సంగతులు కూడా. మరి అవేంటో చూసేద్దామా..!
* రామ్‌గోపాల్‌వర్మ, మణిరత్నం... ఎవరి స్టైల్‌ వారిదే. ఇద్దరూ కలిసి పనిచేయగలరని ఎప్పుడైనా అనుకుంటామా? కానీ చేశారు. ‘గాయం’ సినిమా పేరు చెప్పగానే వర్మే గుర్తొస్తారు. కానీ దాని కథను ఆయన మణిరత్నంతో కలిసి రాశారు. అలాగే మణిరత్నం దర్శకత్వం వహించిన ‘దొంగ దొంగ’ చిత్రానికి కథను రామ్‌గోపాల్‌ వర్మ అందించారు. హిందీలో రిలీజైన ‘దిల్‌సే’ చిత్రాన్ని వారిద్దరూ కలిసి నిర్మించారు!
* రామ్‌చరణ్‌ పుట్టి పెరిగినది చెన్నైలోనే. అందుకే తండ్రి చిరంజీవిని ఇంకా ‘అప్పా’ అనే పిలుస్తారు.
* హీరోలు మహేష్‌బాబు, కార్తి చెన్నైలో ఒకే స్కూల్లో కలిసి చదువు కున్నారు. రానా, రామ్‌చరణ్‌ కూడా చెన్నైలోనే తొమ్మిదో తరగతి వరకూ కలిసి చదివారు. రామ్‌చరణ్‌ భార్య ఉపాసన వారికి స్కూల్‌లో జూనియర్‌. అలాగే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి, హీరో సుమంత్‌ హైదరాబాద్‌లో ఒకే స్కూల్‌లో కలిసి పదోతరగతి పాసయ్యారు.


* సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇంటిపేరు చెంబోలు. ఆయన తన తొలిసినిమా ‘సిరివెన్నెల’నే ఇంటిపేరు చేసుకోవడంతో చాలామందికి అసలుది తెలీదు. సినిమాలకు ముందు ‘భరణి’ అనే కలం పేరుతో కవితలు రాసేవారు.


* రజినీకాంత్‌ హాలీవుడ్‌లో నేరుగా ఓ సినిమాలో నటించారు తెలుసా? దాని పేరు ‘బ్లడ్‌స్టోన్‌’. ఈ సినిమాకు జెర్రీగ్రాంట్‌ అనే అమెరికన్‌తో కలిసి మాస్ట్రో ఇళయరాజా సంగీత సారథ్యం వహించారు.


* 2016లో ‘అ..ఆ’ సినిమా రిలీజైతే... 2017లో ‘ఇ..ఈ’ అనే సినిమా వచ్చింది!


* జూనియర్‌ ఎన్టీఆర్‌ నటించిన ‘యమదొంగ’ చిత్రాన్ని ‘విశ్వామిత్ర క్రియేషన్స్‌’ అనే పతాకంపై నిర్మించారు. టైటిల్స్‌లో ఆ బ్యానర్‌ లోగో వచ్చినప్పుడు విశ్వామిత్రుడిగా ఓ వ్యక్తి కనిపిస్తారు. అదెవరో తెలుసా? పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌.


* జూనియర్‌ ఎన్టీఆర్‌ ‘చల్లచల్లని కూల్‌కూల్‌...’ అంటూ అలరించే నవరత్న ఆయిల్‌ ప్రకటన గుర్తుందా? దానికి దర్శకత్వం వహించింది త్రివిక్రమ్‌. అది మాత్రమే కాదు... పెప్సి, సెల్‌కాన్‌, జోస్‌అలుక్కాస్‌ సంస్థల ప్రకటనలు కూడా ఆయన సారథ్యంలో రూపొందాయి.


* ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ‘యమలీల’ సినిమాలో మొదట మహేష్‌బాబును హీరోగా అనుకున్నారట. కానీ ఆయనను హీరోగా పరిచయం చేయడానికి ఇంకా టైం ఉందని సూపర్‌స్టార్‌ కృష్ణ భావించడంతో... ఆ అవకాశం  అలీ తలుపు తట్టింది.


* చిరంజీవి సినిమాల్లో ఖైదీ ఆయన కెరీర్‌కే టర్నింగ్‌ పాయింట్‌. కానీ తొలుత ఆ పాత్రకు కృష్ణను అడిగారట. ఆయనకు డేట్స్‌ ఖాళీ లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్‌ చిరు చేతికొచ్చింది.

ఇంకా..

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

రుచులు