OnePlus 9T: ‘ఆక్సిజన్‌’ లేకుండా ‘కలర్‌’తో...
close

Updated : 04/07/2021 20:16 IST
OnePlus 9T: ‘ఆక్సిజన్‌’ లేకుండా ‘కలర్‌’తో...

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇటీవల వన్‌ప్లస్‌ 9 సిరీస్‌లో 9, 9ఆర్‌లతోపాటు 9ప్రో ఫ్లాగ్‌షిప్ మోడల్స్‌ను విడుదల చేసింది. త్వరలోనే వన్‌ప్లస్‌ 9టీ మోడల్‌ను కూడా భారత మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కెమెరాతోపాటు ఓఎస్‌ పరంగా కూడా కీలక మార్పు ఉంటుందని టెక్ వర్గాలు భావిస్తున్నాయి. 9టీ మోడల్‌లో ఆక్సిజన్ ఓఎస్‌ కాకుండా కలర్‌ ఓఎస్‌ ఇవ్వనున్నారట. ఇప్పటికే ఆక్సిజన్‌ ఓఎస్‌ కోడ్‌బేస్‌ను ఒప్పో కలర్‌ ఓఎస్‌తో కలిపేస్తున్నట్లు వన్‌ప్లస్‌ ప్రకటించింది. ఓఎస్‌ సామర్థ్యాన్ని మెరుగుపరచడంతో పాటు యూజర్స్‌కి అద్భుతమైన సాఫ్ట్‌వేర్‌ అనుభూతిని అందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న వన్‌ప్లస్‌ మొబైల్‌ యూజర్స్‌ ఆక్సిజన్‌ ఓఎస్‌ను ఎప్పటిలానే తమ ఫోన్లలో ఉపయోగించవచ్చు. ఇకనుంచి ఈ ఓఎస్‌ మరింత స్థిరమైన, బలమైన వేదికగా మీకు అందుబాటులో ఉంటుంది’’ అని వన్‌ప్లస్‌ ఒక ప్రకటనలో తెలిపింది. జులై లేదా సెప్టెంబర్‌ నెలలో 9టీ మోడల్‌ను మార్కెట్లోకి విడుదల చేయనునున్నారని సమాచారం. ఇందులో వెనకవైపు 108ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు మరో మూడు కెమెరాలు ఉంటాయని తెలుస్తోంది. మరోవైపు వన్‌ప్లస్‌ 9టీ కలర్‌ ఓఎస్‌తో రాకపోవచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. 

వన్‌ప్లస్‌ ఆక్సిజన్‌ ఓఎస్‌ను ఒప్పో కలర్‌ ఓఎస్‌తో విలీనం చేస్తున్నట్లు  ప్రకటిస్తూ..పలు కీలక అంశాలను ప్రస్తావించింది. ఇందులో తమ తాజా నిర్ణయం వల్ల భవిష్యత్తులో రాబోయే మోడల్స్‌లోనే అప్‌డేట్‌ ఉంటుందని, ప్రస్తుత యూజర్స్‌కి మెయింటెన్స్‌ షెడ్యూల్ ప్రకారం జరుగుతుందని వెల్లడించింది. అలానే ఆక్సిజన్‌ ఓఎస్‌, కలర్‌ ఓఎస్‌ మధ్య కోడ్‌బేస్‌-లెవల్‌ ఇంటిగ్రేషన్‌ ఆండ్రాయిడ్ 12తోపాటు ఓవర్‌ ది ఎయిర్‌ (ఓటీఏ) వస్తుందని తెలిపింది.

ఇప్పటికే వన్‌ప్లస్‌ టీ, ఆర్‌ మోడల్స్‌తో పాటు వన్‌ప్లస్‌ 8 మోడల్‌కు మెరుగుపరిచిన సాఫ్ట్‌వేర్ మెయింటెనెన్స్‌ షెడ్యూల్‌ కింద ముఖ్యమైన మూడు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌తోపాటు నాలుగు సంవత్సరాలకు సెక్యూరిటీ అప్‌డేట్లను విడుదల చేసింది. అలానే వన్‌ప్లస్‌ నార్డ్‌తోపాటు నార్డ్‌ సీఈ 5జీ వంటి ఇతర నార్డ్ కొత్త మోడల్స్‌కు రెండు ఆండ్రాయిడ్ అప్‌డేట్స్‌, మూడు సంవత్సరాలకు సెక్యూరిటీ అప్‌డేట్లను ఇవ్వనుంది. అయితే వన్‌ప్లస్ నార్డ్‌ ఎన్‌10, నార్డ్ ఎన్‌100తోపాటు ఇతర నార్డ్‌ ఎన్‌ సిరీస్‌ మోడల్స్‌కి ఒక ఆండ్రాయిడ్ అప్‌డేట్‌, మూడు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్‌ను మాత్రమే ఇవ్వనున్నట్లు తెలిపింది. 

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

తాజా వార్తలు

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

దేవ‌తార్చ‌న