నిందాతీతుడు

జేతవన ఆశ్రమంలో అనింద్యుడు అనే మరుగుజ్జు ఉండేవాడు. అతడు సాటి భిక్షువుల అపహాస్యానికి వస్తువయ్యాడు. ‘త్రివిక్రమావతారం చాలించు.., పండ్లు అందడంలేదు కోసిపెట్టు’ అంటూ ఆటపట్టించేవారు.

Published : 05 Oct 2023 00:26 IST

జేతవన ఆశ్రమంలో అనింద్యుడు అనే మరుగుజ్జు ఉండేవాడు. అతడు సాటి భిక్షువుల అపహాస్యానికి వస్తువయ్యాడు. ‘త్రివిక్రమావతారం చాలించు.., పండ్లు అందడంలేదు కోసిపెట్టు’ అంటూ ఆటపట్టించేవారు. ఆ ఎగతాళి మాటలకు అనింద్యుడి ప్రతిస్పందన హుందాగా ఉండేది. ఎంత గేలి చేసినా ముఖంలో ప్రసన్నత, చిరునవ్వు మాయమయ్యేవి కావు. ‘పొట్టివాడు’, ‘వామనుడు’ లాంటి అపహాస్యాలకు బాధ కలిగినా మానసికంగా దైన్యాన్ని పొందేవాడు కాదు.  దేహం అనిత్యం, అశుచిమయం, దుఃఖభరితం- అనే మూడు స్థితులను పొందాల్సిందే అని గ్రహించినవాడు. అతడి క్షమను, ఓర్పును గమనించిన బుద్ధుడు ‘పర్వతం గాలికి చలించనట్లే అనింద్యుడు నింద, స్తుతులకు చలించడు. అదే స్థితప్రజ్ఞత. ఇదే పండితుల లక్షణం.

శైలో యథైక ఘనో వాతేన న సమీర్యతే ఏవం
నిందా ప్రశంసాశు న సమీర్యన్తే పండితాః’

అంటూ ప్రశంసించేసరికి గేలిచేసిన శిష్యులు సిగ్గుతో తలవంచుకున్నారు.

పద్మజ


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని