AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాలు.. ఎప్పుడంటే?

AP SSC Results: ఏపీలో పదో తరగతి ఫలితాల విడుదలకు రంగం సిద్ధమైంది. ఈ ఫలితాలను మంత్రి బొత్స శనివారం ఉదయం విడుదల చేయనున్నారు.

Updated : 05 May 2023 16:30 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్న పదో తరగతి ఫలితాల (SSC Results) విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 6న (శనివారం) ఉదయం 11గంటలకు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ‘పది’ ఫలితాలు విడుదల చేయనున్నారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో శుక్రవారం జరిగిన చర్చల సందర్భంగా మంత్రి బొత్స స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. అలాగే, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానంద రెడ్డి సైతం అధికారిక ప్రకటన విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను www.eenadu.nethttps://www.results.bse.ap.gov.in/ వెబ్‌సైట్‌లలో చెక్‌ చేసుకోవచ్చు.

రాష్ట్రవ్యాప్తంగా 3,349 కేంద్రాల్లో నిర్వహించిన పదో తరగతి పరీక్షలను 6.5లక్షల మందికి పైగా విద్యార్థులు రాసినట్టు దేవానందరెడ్డి ఇటీవల వెల్లడించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 3 నుంచి 18వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగ్గా.. 19 నుంచి 26వరకు స్పాట్‌ వాల్యుయేషన్‌ చేపట్టారు.


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని