పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా?

పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా? అయితే ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే. కొత్త తరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి ఈనాడు జర్నలిజం స్కూలు దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది.

Updated : 24 Mar 2023 17:21 IST

అక్షరానికి సామాజిక ప్రయోజనం కలిగించే పాత్రికేయ వృత్తిలో చేరాలనుకుంటున్నారా? సమాజాభివృద్ధి పట్ల ఆకాంక్ష, భాష మీద పట్టు మీకు ఉంటే, ఈ ప్రకటన కచ్చితంగా మీ కోసమే. కొత్త తరం పాత్రికేయుల్ని తీర్చిదిద్దటం కోసం మల్టీమీడియా, టెలివిజన్, మొబైల్‌ జర్నలిజం విభాగాల్లో పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తుల్ని ఆహ్వానిస్తున్నాం.

ఎంపిక

మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యాన్నీ, అనువాద సామర్థ్యాన్నీ, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది.

శిక్షణ, భృతి

ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో మొదటి ఆరు నెలలు Rs 14,000, తరువాతి ఆరు నెలలు Rs 15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది.

ఉద్యోగంలో

స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో Rs 18,000 జీతం ఉంటుంది. అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్‌లో Rs 20,000 వరకూ, ఆ తరువాత కన్ఫర్మేషన్‌లో Rs 22,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి.

దరఖాస్తు విధానం

దరఖాస్తు ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలి. www.eenadu.net, pratibha.eenadu.net/eenadupratibha.netలలో దరఖాస్తు అందుబాటులో ఉంటుంది. దరఖాస్తు రుసుము Rs 200 ఆన్‌లైన్‌లోనే చెల్లించాలి. దరఖాస్తు ధ్రువీకరణ నకలును అభ్యర్థులు తమ వద్ద తప్పనిసరిగా ఉంచుకోవాలి.

ఒప్పంద పత్రం

స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూపు సంస్థల్లో 3 సంవత్సరాలు విధిగా పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి.

అర్హతలు

  • తేట తెలుగులో రాయగల నేర్పు    
  • ఆంగ్లభాషపై అవగాహన 
  • లోకజ్ఞానం, వర్తమాన వ్యవహారాలపై పట్టు    
  • ప్రజా శ్రేయస్సు కోసం పాటుపడాలన్న తపన
  • మీడియాలో స్థిరపడాలన్న బలమైన ఆకాంక్ష
  • 01.06.2023 నాటికి 28కి మించని వయసు
  • డిగ్రీ ఉత్తీర్ణత 

(డిగ్రీ చివరి ఏడాది పరీక్షలు రాసేవారూ అర్హులే)

ముఖ్య తేదీలు

నోటిఫికేషన్‌ : 23.03.2023

ఆన్‌లైన్లో దరఖాస్తుల సమర్పణకు గడువు: 06.04.2023

ప్రవేశ పరీక్ష: 16.04.2023

కోర్సు ప్రారంభం: 05.06.2023ఈనాడు జర్నలిజం స్కూలు

రామోజీ ఫిల్మ్‌సిటీ, హైదరాబాద్‌ - 501 512. ఫోన్‌: 040 2223 2223


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు