ఈ కోర్సుల్లో చేరే వీలుందా?

బీఎస్‌సీ (బయోటెక్‌, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ) చదువుతున్నాను. అగ్రి బయోటెక్‌/ అగ్రి మైక్రోబయాలజీ/ ప్లాంట్‌ బయోటెక్‌/ సీడ్‌ సైన్స్‌ టెక్నాలజీలో పీజీ చేయొచ్చా?

Published : 26 Jul 2021 02:52 IST

బీఎస్‌సీ (బయోటెక్‌, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ) చదువుతున్నాను. అగ్రి బయోటెక్‌/ అగ్రి మైక్రోబయాలజీ/ ప్లాంట్‌ బయోటెక్‌/ సీడ్‌ సైన్స్‌ టెక్నాలజీలో పీజీ చేయొచ్చా?

-ఎ. సాయి పవన్‌

సాధారణంగా ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ చదవడానికి డిగ్రీలో అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ/ సెరికల్చర్‌ లాంటి సబ్జెక్టులు చదివివుండాలి. మీరు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కెమిస్ట్రీలతో డిగ్రీ చదివారు కాబట్టి, చాలా యూనివర్సిటీల్లో ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ చదవడానికి మీరు అర్హులు కారు. కానీ జీబీ పంత్‌ యూనివర్సిటీ ఆఫ్‌ అగ్రికల్చర్‌ అండ్‌ టెక్నాలజీలో ప్రవేశానికి రీజనల్‌ సెంటర్‌ ఫర్‌ బయోటెక్నాలజీ వారు నిర్వహించే గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌- బయోటెక్నాలజీ (GAT-B) పరీక్ష రాయవలసి ఉంటుంది. రామకృష్ణ మిషన్‌ వివేకానంద ఎడ్యుకేషనల్‌ అండ్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ల్లో కూడా అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ పీజీకి అర్హత ఉంది. ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ మైక్రోబయాలజీ చదవాలంటే డిగ్రీలో అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌/ ఫారెస్ట్రీ/ అగ్రికల్చర్‌ బయోటెక్నాలజీ/ సెరికల్చర్‌, డైరీ సైన్సెస్‌/ బీవీఎస్‌సీ/ హోమ్‌ సైన్స్‌ లాంటివి చదివివుండాలి. అందుకని మీరు ఎంఎస్‌సీ అగ్రికల్చర్‌ మైక్రోబయాలజీ చదవలేరు.

ఎంఎస్‌సీ ప్లాంట్‌ బయోటెక్నాలజీ చదవడానికి మీరు అర్హులే. ఈ కోర్సు ఎంజీఎం యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌లతో పాటు కొద్ది ప్రైవేటు కళాశాలల్లో అందుబాటులో ఉంది. మీ ఉద్యోగావకాశాలను మెరుగుపర్చుకోవాలంటే ఎంఎస్‌సీ బయోటెక్నాలజీ కోర్సు ఎంచుకోండి. ఎంఎస్‌సీ సీడ్‌ సైన్స్‌ టెక్నాలజీ చదవాలంటే డిగ్రీలో అగ్రికల్చర్‌ సంబంధిత కోర్సులు చదివివుండాలి. బీఎస్‌సీ అర్హతతో కొన్ని ప్రైవేటువర్సిటీల్లో మాత్రమే ఈ కోర్సును చదివే అవకాశం ఉంది. ఆయా విద్యాసంస్థల్లో చేరేముందు, ఆ సంస్థల విశ్వనీయతను తెలుసుకొని నిర్ణయం తీసుకోండి.

- ప్రొ. బి. రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని