Updated : 06 Sep 2021 06:38 IST

నోటీస్‌బోర్డు

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎన్‌హెచ్‌ఎం, ఏపీ - 858 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్‌ కార్యాలయం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ప్రాజెక్ట్‌ కింద  రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల డీఎంహెచ్‌ఓల ద్వారా కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 858 పోస్టులు - ఖాళీలు: స్పెషలిస్టులు-53, మెడికల్‌ ఆఫీసర్లు-308, స్టాఫ్‌ నర్సులు-324, ల్యాబ్‌ టెక్నీషియన్లు-14, పారామెడికల్‌ స్టాఫ్‌-90, కన్సల్టెంట్లు-13, సపోర్ట్‌ స్టాఫ్‌-56. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, జీఎన్‌ఎం/ బీఎస్సీ(నర్సింగ్‌), డీఎంఎల్‌/ టీఎంఎల్‌టీ/ బీఎస్సీ(ఎంఎల్‌టీ), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, ఎంఎస్‌డబ్ల్యూ/ఎంఏ (సోషల్‌ వర్క్‌), ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, వయసు, ఇతర వివరాల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకి చివరి తేది: 2021, సెప్టెంబరు 15. చిరునామా: సంబంధిత జిల్లాల వైద్య, ఆరోగ్యశాఖాధికారి కార్యాలయాలకు దరఖాస్తు చేసుకోవాలి. వెబ్‌సైట్‌: https://visakhapatnam.ap.gov.in/


ఐటీబీపీలో 553 మెడికల్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ దేశీయ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌(ఐటీబీపీ) కింది పోస్టుల భర్తీకి అర్హులైన పురుషులు, మహిళల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 553 పోస్టులు - ఖాళీలు: సూపర్‌ స్పెషలిస్ట్‌-05, స్పెషలిస్ట్‌-201, మెడికల్‌ ఆఫీసర్లు-345, డెంటల్‌ సర్జన్‌-02. అర్హత: ఎంబీబీఎస్‌/ తత్సమాన, స్పెషలైజ్జ్‌ క్వాలిఫికేషన్‌ ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2021, సెప్టెంబరు 13. దరఖాస్తు చివరి తేది: 2021, అక్టోబరు 27. వెబ్‌సైట్‌: https://recruitment.itbpolice.nic.in/


సీ-డ్యాక్‌లో 259 ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వశాఖకి చెందిన పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 259 పోస్టులు - ఖాళీలు: ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు-249, ప్రాజెక్ట్‌ అసోసియేట్లు-04, ప్రాజెక్ట్‌ సపోర్ట్‌ స్టాఫ్‌-06. విభాగాలు: సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌, డేటాబేస్‌ డెవలప్‌మెంట్‌, యూఐ/ యూఎక్స్‌ డిజైనింగ్‌ తదితరాలు. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎమ్మెస్సీ/ ఎంసీఏ ఉత్తీర్ణత, టెక్నికల్‌ స్కిల్స్‌, అనుభవం. ఎంపిక విధానం: రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకి చివరి తేది: 2021, సెప్టెంబరు 25. వెబ్‌సైట్‌: https://www.cdac.in/


ఐఏఎఫ్‌ - 174 గ్రూప్‌ సీ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకి చెందిన ఇండియన్‌ ఏర్‌ ఫోర్స్‌ (ఐఏఎఫ్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* గ్రూప్‌ సీ సివిలియన్‌ పోస్టులు

మొత్తం ఖాళీలు: 174 పోస్టులు: కార్పెంటర్‌, కుక్‌, ఎంటీఎస్‌, ఎల్‌డీసీ, స్టోర్‌ కీపర్‌, మెస్‌ స్టాఫ్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ, గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష, స్కిల్‌/ ప్రాక్టికల్‌/ ఫిజికల్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకి చివరి తేది: ఎంప్లాయిమెంట్‌ న్యూస్‌లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 30 రోజుల్లోపు. వెబ్‌సైట్‌: https://midhani-india.in/


మిధానీ-హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన హైదరాబాద్‌లోని మిశ్రధాతు నిగమ్‌ లిమిటెడ్‌ (మిధానీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 64 పోస్టులు: సీనియర్‌ ఆపరేటివ్‌ ట్రెయినీ, జూనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ సెక్యురిటీ ఇన్‌స్పెక్టర్‌ తదితరాలు. విభాగాలు: ఫిట్టర్‌, మెకానికల్‌, టర్నర్‌, ఆటో ఎల‌్రక్టీషియన్‌, ఎన్‌డీటీ ఆపరేటర్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఐటీఐ, గ్రాడ్యుయేషన్‌, ఇంజినీరింగ్‌ డిప్లొమా ఉత్తీర్ణత. వయసు: పోస్టును అనుసరించి 30 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్‌ మార్కులు, పని అనుభవం, రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు చివరి తేది: 2021, సెప్టెంబరు 18. వెబ్‌సైట్‌: https://indianairforce.nic.in/


అప్రెంటిస్‌షిప్‌

ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో 243 అప్రెంటిస్‌లు

భారత ప్రభుత్వ అణుశక్తి విభాగానికి చెందిన హైదరాబాద్‌లోని ఎల‌్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ అఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) వివిధ ట్రేడుల్లో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

* ట్రేడ్‌ అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు: 243 ట్రేడులు: ఎల‌్రక్టీషియన్‌, ఎల‌్రక్టానిక్‌ మెకానిక్‌, ఫిట్టర్‌, టర్నర్‌, మెషినిస్ట్‌, కార్పెంటర్‌, ప్లంబర్‌, వెల్డర్‌ తదితరాలు. అర్హత: సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ (ఎన్‌సీవీటీ సర్టిఫికెట్‌) ఉత్తీర్ణత. వయసు: 14.10.2021 నాటికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: ఐటీఐలో సాధించిన మెరిట్‌ మార్కులు, డాక్యమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకి చివరి తేది: 2021, సెప్టెంబరు 16. www.ecil.co.in/


Advertisement

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని