ఉద్యోగాలు

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎల‌్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 25 Apr 2022 06:26 IST

ఈసీఐఎల్‌, హైదరాబాద్‌లో...

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న ఎల‌్రక్టానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ట్రెయినీలు మొత్తం ఖాళీలు: 40 విభాగాల వారీగా ఖాళీలు: ఈసీఈ-21, మెకానికల్‌-10, సీఎస్‌ఈ-09.

అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత.

వయసు: 25 ఏళ్లు మించకుండా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్‌-2022 మెరిట్‌ స్కోర్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు

చివరి తేది: 2022, మే 14.

వెబ్‌సైట్‌: https://careers.ecil.co.in/


హెచ్‌పీసీఎల్‌, విశాఖ రిఫైనరీలో..

విశాఖపట్నం (ఏపీ)లోని హిందుస్థాన్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (హెచ్‌పీసీఎల్‌), విశాఖ రిఫైనరీ కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
టెక్నీషియన్లు మొత్తం ఖాళీలు: 186

విభాగాలు: ఆపరేషన్స్‌ టెక్నీషియన్లు, బాయిలర్‌ టెక్నీషియన్లు, మెయింటెనెన్స్‌ టెక్నీషియన్లు తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, సైన్స్‌ గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

వయసు: 18 - 25 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ (సీబీటీ), స్కిల్‌ టెస్ట్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 21.

వెబ్‌సైట్‌: ‌www.hindustanpetroleum.com/


ఎన్‌ఆర్‌ఎస్‌సీ-హైదరాబాద్‌లో..

ఇస్రో ఆధ్వర్యంలోని హైదరాబాద్‌లో ఉన్న నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌(ఎన్‌ఆర్‌ఎస్‌సీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

మొత్తం ఖాళీలు: 55

పోస్టులు-ఖాళీలు: జేఆర్‌ఎఫ్‌ 12, రిసెర్చ్‌ సైంటిస్ట్‌ 41, రిసెర్చ్‌ అసోసియేట్‌ 02.

అర్హత: పోస్టులను అనుసరించి బీఈ/ బీటెక్‌/ ఎంఈ/ ఎంటెక్‌/ ఎంఎస్సీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత.

వయసు: 28- 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: స్క్రీనింగ్‌, కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

 దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: ఏప్రిల్‌ 25, నుంచి.

దరఖాస్తు చివరి తేది: మే 08, 2022

వెబ్‌సైట్‌: www.nrsc.gov.in/ 


వాక్‌ఇన్‌

ఇన్‌కాయిస్‌, హైదరాబాద్‌లో... 

హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌) తాత్కాలిక/ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 51

విభాగాల వారీగా ఖాళీలు: సైంటిఫిక్‌ పర్సనల్‌-31, టెక్నికల్‌ పర్సనల్‌-20.

అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం.

వాక్‌ఇన్‌ తేదీలు: 2022, మే 04, 05.

వేదిక: ఆడిటోరియం, ఇన్‌కాయిస్‌, హైదరాబాద్‌. 
వెబ్‌సైట్‌: https://incois.gov.in/


నల్గొండ ప్రభుత్వ వైద్య కళాశాలలో..

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన నల్గొండలోని ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ కార్యాలయం ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

మొత్తం ఖాళీలు: 23 పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-15, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు-08.

విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్‌, అనెస్తీషియా.

అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్‌, మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత. అనుభవం.

వాక్‌ఇన్‌ తేది: 2022, ఏప్రిల్‌ 27.

వేదిక: గ్రీవెన్స్‌ హాల్‌, గ్రౌండ్‌ ఫ్లోర్‌, కలెక్టర్‌ కార్యాలయం, నల్గొండ, తెలంగాణ.

వెబ్‌సైట్‌: https://dme.telangana.gov.in/


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని