నోటిఫికేషన్స్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 30 May 2022 06:14 IST

ఉద్యోగాలు
యూపీఎస్సీ- 161 ఉద్యోగాలు

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (యూపీఎస్సీ) వివిధ కేంద్ర మంత్రిత్వశాఖల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 161 పోస్టులు: డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్‌ కీపర్‌, పోస్ట్‌ మాస్టర్‌, మినరల్‌ ఆఫీసర్లు, వైస్‌ ప్రిన్సిపల్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్‌ డిగ్రీ, మాస్టర్స్‌ డిగ్రీ, మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: రిక్రూట్‌మెంట్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022 జూన్‌ 16. వెబ్‌సైట్‌: www.upsc.gov.in/


బీఆర్‌ఓలో 876 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ (బీఆర్‌ఓ) పరిధిలోని బోర్డర్‌ రోడ్స్‌ వింగ్‌ - జనరల్‌ రిజర్వ్‌ ఇంజినీర్‌ ఫోర్స్‌ విభాగం కింది పోస్టుల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 876 స్టోర్‌ కీపర్‌ టెక్నికల్‌: 377 మల్టీ స్కిల్డ్‌ వర్కర్‌ (డ్రైవర్‌ ఇంజిన్‌ స్టాటిక్‌): 499 వెబ్‌సైట్‌: http://bro.gov.in/


ఎస్‌బీఐలో రిస్క్‌ స్పెషలిస్టులు

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం రెగ్యులర్‌ ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

రిస్క్‌ స్పెషలిస్టులు

మొత్తం ఖాళీలు: 14 అర్హత: పోస్టుని అనుసరించి సీఏ/ సీఎఫ్‌ఏ/ ఎంబీఏ/ పీజీడీఎం/ ఎమ్మెస్సీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: ఇంటర్వ్యూలో సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, జూన్‌ 16. వెబ్‌సైట్‌: https://sbi.co.in/


సీఎస్‌ఐఆర్‌-సీఎల్‌ఆర్‌ఐలో 55 కొలువులు

చెన్నైలోని సీఎస్‌ఐఆర్‌ - సెంట్రల్‌ లెదర్‌ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సీఎల్‌ఆర్‌ఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

టెక్నీషియన్లు

మొత్తం ఖాళీలు: 55 ట్రేడులు: లెదర్‌ గూడ్స్‌ మేకర్‌, ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, ఫుట్‌వేర్‌ మేకర్‌, ఇన్‌స్ట్రుమెంట్‌ మెకానిక్‌, ఫిట్టర్‌ తదితరాలు అర్హత: పదో తరగతి/ తత్సమాన ఉత్తీర్ణతతో పాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ అర్హత ఉండాలి. వయసు: 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక: రాత పరీక్ష/ ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022., జూన్‌ 20. వెబ్‌సైట్‌: www.clri.org/


తెలంగాణ ఆయుష్‌ విభాగంలో...

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన సికిందరాబాద్‌లోని ఆయుష్‌ విభాగం కమిషనర్‌ కార్యాలయం నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ప్రోగ్రాం ద్వారా ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మెడికల్‌ ఆఫీసర్లు

మొత్తం ఖాళీలు: 159 విభాగాలు-ఖాళీలు: ఆయుర్వేద-93, యునాని-17, హోమియోపతి-42, నేచురోపతి-07. అర్హత: సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ/ పీజీ డిగ్రీ ఉత్తీర్ణత. తెలంగాణలో పర్మినెంట్‌ రిజిస్టర్డ్‌ మెడికల్‌ ప్రాక్టిషనర్‌ అయి ఉండాలి. నేచురోపతికి ఇంటర్మీడియట్‌/ తత్సమాన ఉత్తీర్ణులై ఉండాలి. ఎంపిక: యూజీ డిగ్రీ పరీక్షలో (బీఏఎంఎస్‌/ బీయూఎంఎస్‌/ బీహెచ్‌ఎంఎస్‌/ బీఎన్‌వైఎస్‌) సాధించిన మెరిట్‌ మార్కుల ఆధారంగా. ఇంటర్వ్యూలు లేవు. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: 2022, మే 31. చిరునామా: కమిషనర్‌, ఆయుష్‌ విభాగం, సికిందరాబాద్‌, తెలంగాణ. వెబ్‌సైట్‌: https://ayush.telangana.gov.in/


డీఆర్‌డీఓ-ఆర్‌ఏసీలో 58 పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన దిల్లీ (తిమార్‌పూర్‌)లోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌ (ఆర్‌ఏసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సైంటిస్టులు (సీ, డీ, ఈ, ఎఫ్‌)

మొత్తం ఖాళీలు: 58 విభాగాలు: మెకానికల్‌/ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, రేడియేషన్‌ ఫిజిక్స్‌ తదితరాలు. అర్హత: పోస్టుల్ని అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తులకు చివరి తేది: ప్రకటన వెలువడిన తేదీ నుంచి నాలుగు వారాల్లోపు (28 రోజులు). వెబ్‌సైట్‌: https://rac.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని