నోటిఫికేషన్స్‌

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేయటానికి 5369 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌Â కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నియామక ప్రకటన విడుదల చేసింది.

Updated : 08 Mar 2023 05:52 IST

ప్రభుత్వ ఉద్యోగాలు


స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ - 5369 పోస్టులు

కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో పనిచేయటానికి 5369 సెలక్షన్‌ పోస్టుల భర్తీకి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (ఎస్‌ఎస్‌సీ) నియామక ప్రకటన విడుదల చేసింది.

పోస్టులు: ఇన్వెస్టిగేటర్‌, డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌, లైబ్రరీ ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, హిందీ టైపిస్ట్‌, సౌండ్‌ టెక్నీషియన్‌, అకౌంటెంట్‌, ప్లానింగ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌, టెక్స్‌టైల్‌ డిజైనర్‌, రిసెర్చ్‌ ఇన్వెస్టిగేటర్‌, రిసెర్చ్‌ అసిస్టెంట్‌, లాబొరేటరీ అసిస్టెంట్‌, జూనియర్‌ కంప్యూటర్‌, లైబ్రరీ-కమ్‌-ఇన్ఫర్మేషన్‌ అసిస్టెంట్‌, సెక్షన్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ ప్లాంట్‌ ప్రొటెక్షన్‌ ఆఫీసర్‌, జూనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, డ్రాఫ్ట్స్‌మన్‌, ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌, అసిస్టెంట్‌ వెల్ఫేర్‌ అడ్మినిస్ట్రేటర్‌, నావిగేషనల్‌ అసిస్టెంట్‌.

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌, గ్రాడ్యుయేషన్‌.

వయసు: 18-30 ఏళ్లు ఉండాలి. (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు సడలింపు ఉంటుంది).

ఎంపిక: స్కిల్‌ టెస్ట్‌/ కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ టెస్ట్‌/ డేటాఎంట్రీ టెస్ట్‌/ కంప్యూటర్‌ పరీక్ష ఆధారంగా.

పరీక్ష విధానం: పరీక్షలో భాగంలో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు. అందుకు 50 మార్కులు కేటాయిస్తారు. జనరల్‌ అవేర్‌నెస్‌ 25 ప్రశ్నలు 50 మార్కులు, క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు, ఇంగ్లిష్‌ నుంచి 25 ప్రశ్నలు 50 మార్కులు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.50 రుణాత్మక మార్కు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: రూ.100.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 27.03.2023

ఆన్‌లైన్‌ పేమెంట్‌ చివరి తేదీ: 28.03.2023.

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: జూన్‌-జులై 2023.

https://ssc.nic.in/


అలిమ్‌కో-కాన్పూర్‌లో...

కాన్పూర్‌కు చెందిన ఆర్టిఫిషియల్‌ లింబ్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కార్పొరేషన్‌ (అలిమ్‌కో) 27 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు-విభాగాలు: మేనేజర్‌ (సోర్సింగ్‌, టెక్స్‌టైల్‌), డిప్యూటీ మేనేజర్‌ (సివిల్‌, ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ (మెకానికల్‌, ఎలక్ట్రికల్‌), అసిస్టెంట్‌ మేనేజర్‌ (ట్రైనింగ్‌, ప్లాస్టిక్‌), జూనియర్‌ మేనేజర్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ (మెకానికల్‌), సివిల్‌ ఇంజనీరింగ్‌, ఆఫీసర్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌ (మెకానికల్‌), ఫైర్‌, సేఫ్టీ అండ్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, సర్వీస్‌ అసిస్టెంట్‌-జనరల్‌, డేటా అనలిస్ట్‌/ సైంటిస్ట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఐటీఐ/ డిప్లొమా/ ఇంజినీరింగ్‌ డిగ్రీ/ బీటెక్‌/ గ్రాడ్యుయేషన్‌/ ఎంబీఏ/ ఎంఎస్సీ/ ఎంసీఏ/ పీజీ డిగ్రీ/ పీజీడీఎం.

వయసు: 40-50 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో పంపాలి.

చిరునామా: Manager sPersonal & Administrationz Artificial Limbs Manufacturing Corporation of India G.T. Road, Kanpur  - 209217 sU.Pz.

దరఖాస్తుకు చివరి తేదీ: 13.03.2023

వెబ్‌సైట్‌:www.alimco.in/CurrentRecruitment.aspx?pid=`IJ043widzsVyfR8Z9VLfQ==


సీపీసీబీ-దిల్లీలో 163 ఖాళీలు

దిల్లీలోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంట్రల్‌ పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డ్‌ (సీపీసీబీ) 163  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సైంటిస్ట్‌ బీ, అసిస్టెంట్‌ లా ఆఫీసర్‌, సీనియర్‌ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ సూపర్‌వైజర్‌, అసిస్టెంట్‌, అకౌంట్స్‌ అసిస్టెంట్‌, సీనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌, డేటా ఎంట్రీ ఆపరేటర్‌, జూనియర్‌ ల్యాబొరేటరీ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి 10వ తరగతి/ 12వ తరగతి/ డిప్లొమా/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ మాస్టర్స్‌ డిగ్రీ.

వయసు: 18-35 ఏళ్లు ఉండాలి (ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు వయసులో సడలింపు ఉంటుంది).

ఎంపిక: రాతపరీక్ష, స్కిల్‌టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.1000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31.03.2023.

వెబ్‌సైట్‌: https://cpcb.nic.in/jobs.php


ఎన్‌ఐఈ-చెన్నైలో 23 పోస్టులు

చెన్నైలోని ఐసీఎంఆర్‌ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడమాలజీ (ఎన్‌ఐఈ) 23  పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: ప్రాజెక్ట్‌ టెక్నికల్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ సెమీ స్కిల్డ్‌ వర్కర్‌, జూనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌, ప్రాజెక్ట్‌ రిసెర్చ్‌ అసిస్టెంట్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి హైస్కూల్‌/ ఐటీఐ/ 12వ తరగతి/ డీఎంఎల్‌టీ/ గ్రాడ్యుయేషన్‌/ ఎంబీబీఎస్‌/ మాస్టర్స్‌ డిగ్రీ/ ఎండీ/ డీఎన్‌బీ/ పీజీ డిగ్రీ/ పీహెచ్‌డీ.

వయసు: 28-70 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: రాతపరీక్ష/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 17.03.2023.

వెబ్‌సైట్‌: https://nie.gov.in/oppurtunities/careers 


ప్రవేశాలు
తెలంగాణ ఎడ్‌సెట్‌-2023

రెండేళ్ల బీఈడీ కోర్సులో ప్రవేశాల కోసం తెలంగాణ స్టేట్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (టీఎస్‌ ఎడ్‌సెట్‌) ప్రకటన విడుదలయింది.

అర్హత: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ/ ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉత్తీర్ణత. చివరి ఏడాది చదువుతున్న విద్యార్థులూ అర్హులే.

వయసు: 19 ఏళ్లు పూర్తిచేసుకుని ఉండాలి.

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా.

పరీక్ష విధానం: పరీక్షలో మొత్తం 150 మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు ఇస్తారు. మ్యాథ్స్‌, సాంఘిక శాస్త్రం, జనరల్‌ ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌ - ఎడ్యుకేషనల్‌ ఇష్యూస్‌, కంప్యూటర్‌ అవేర్‌నెస్‌, టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ అంశాలపై ప్రశ్నలు అడుగుతున్నారు.

దరఖాస్తు ఫీజు: రూ.750.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 20.04.2023.

హాల్‌టికెట్‌ డౌన్‌లోడ్‌ తేదీ: 05.05.2023.

పరీక్ష తేదీ: 18.05.2023.

వెబ్‌సైట్‌: https://edcet.tsche.ac.in/TSEDCET/Course.aspx


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని