నోటిఫికేషన్స్‌

ఝార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ).. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ప్రాతిపదికన 152 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 25 Apr 2023 05:10 IST

ఉద్యోగాలు
ఎన్‌టీపీసీ లిమిటెడ్‌లో 152 పోస్టులు

ఝార్ఖండ్‌ రాష్ట్రం రాంచీలోని నేషనల్‌ థర్మల్‌ పవర్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఎన్‌టీపీసీ).. ఫిక్స్‌డ్‌ టర్మ్‌ ఎంప్లాయ్‌మెంట్‌ ప్రాతిపదికన 152 పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

1. మైన్‌ ఓవర్‌మ్యాన్‌: 84  

2. ఓవర్‌మ్యాన్‌ (మ్యాగజైన్‌): 07  

3. మెకానికల్‌ సూపర్‌వైజర్‌: 22  

4. ఎలక్ట్రికల్‌ సూపర్‌వైజర్‌: 20  

5. ఒకేషనల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్ట్రక్టర్‌: 03  

6. మైన్‌ సర్వే: 09

7. మైనింగ్‌ సర్దార్‌: 07  

అర్హత: పోస్టును అనుసరించి 12వ తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా.

వయసు: 25 సంవత్సరాలు మించకూడదు.

ఎంపిక: రాత, నైపుణ్యం/ సామర్థ్య పరీక్షల ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.300 (ఎస్సీ, ఎస్టీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు మినహాయింపు).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 05-05-2023.

వెబ్‌సైట్‌: https://careers.ntpc.co.in/recruitment/


ఫ్యాక్ట్‌లో 69 వివిధ కొలువులు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ ట్రావెన్‌కోర్‌ లిమిటెడ్‌ (ఫ్యాక్ట్‌) 69 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ మేనేజర్‌, ఆఫీసర్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ, టెక్నీషియన్‌, క్రాఫ్ట్స్‌మ్యాన్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ తదితరాలు.

విభాగాలు: సేల్స్‌, ప్రాసెస్‌, హ్యూమర్‌ రిసోర్స్‌, సివిల్‌, ఫిట్టర్‌ కమ్‌ మెకానిక్‌, ఎలక్ట్రికల్‌, మార్కెటింగ్‌ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో 10వ తరగతి/ డిప్లొమా/ ఐటీఐ/ బీఎస్సీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ/ సీఏ/ పీజీ.

వయసు: 26-45 ఏళ్లు ఉండాలి.

ఎంపిక: పోస్టును అనుసరించి సీబీటీ/ ప్రాక్టికల్‌ టెస్ట్‌/ షార్ట్‌లిస్టింగ్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

* సీబీటీ పరీక్షలో భాగంగా ఇంగ్లిష్‌, జనరల్‌ నాలెడ్జ్‌, మేనేజ్‌మెంట్‌ ఆప్టిట్యూడ్‌, రీజనింగ్‌ల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

దరఖాస్తు ఫీజు: రూ.1180.

ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రారంభం: 26.04.2023 నుంచి.

దరఖాస్తుకు చివరి తేదీ: 16.05.2023.

వెబ్‌సైట్‌: https://fact.co.in/home/Dynamicpages?MenuId=90


సీడాట్‌లో 18 వివిధ ఉద్యోగాలు

భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ టెలిమాటిక్స్‌ (సీడాట్‌) 18 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: అసోసియేట్‌, మెంబర్‌ సపోర్ట్‌ (ఫైనాన్స్‌).

అర్హత: పోస్టును అనుసరించి బీఎస్సీ/ బీకామ్‌/ బీసీఏ/ బ్యాచిలర్స్‌ డిగ్రీ(కామర్స్‌)/ సీఎంఏ/ సీఏ/ ఐసీడబ్ల్యూఏ.

వయసు: 30 ఏళ్లు మించకూడదు.

పని ప్రదేశం: దిల్లీ/ బెంగళూరు.

ఎంపిక: రాతపరీక్ష/ స్కిల్‌టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 08.05.2023.

వెబ్‌సైట్‌:www.cdot.in/cdotweb/web/careers.php


వాక్‌-ఇన్స్‌
ఈఎస్‌ఐసీ-హైదరాబాద్‌లో  మెడికల్‌ స్టాఫ్‌  

హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌కు చెందిన ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) 40 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సూపర్‌ స్పెషలిస్ట్‌, సీనియర్‌ కన్సల్టెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌ తదితరాలు.

విభాగాలు: రేడియాలజీ, యూరాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, కార్డియాలజీ తదితరాలు.

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎంబీబీఎస్‌/ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా.

వయసు: 45-69 ఏళ్లు ఉండాలి.

ఇంటర్వ్యూ వేదిక: Chamber of Medical Superintendent, ESIC Super Speciality Hospital, Sanathnagar, Hyderabad.

ఇంటర్వ్యూ తేది: 25-28.04.2023.

వెబ్‌సైట్‌:www.esic.gov.in/recruitments/index/page:2


ఈఎస్‌ఐసీ-ఫరీదాబాద్‌లో సీనియర్‌ రెసిడెంట్లు

ఫరీదాబాద్‌లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) 77 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

పోస్టులు: సీనియర్‌ రెసిడెంట్‌, సీనియర్‌ రెసిడెంట్‌ (జీడీఎంఓ).

విభాగాలు: యూరాలజీ, ఆంకాలజీ, మైక్రోబయాలజీ, జనరల్‌ సర్జరీ, పాథాలజీ, సైకియాట్రీ, డెర్మటాలజీ, ఫార్మకాలజీ, క్యాజువాలిటీ తదితరాలు.

అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా/ డీఎన్‌బీ.

వయసు: 45 ఏళ్లు మించకూడదు.

ఇంటర్వ్యూ వేదిక: ఈఎస్‌ఐసీ మెడికల్‌ కాలేజీ అండ్‌ హాస్పిటల్‌, ఎన్‌హెచ్‌-3, ఎన్‌ఐటీ, ఫరీదాబాద్‌.

ఇంటర్వ్యూ తేది: 26.04.2023 (ఉదయం 9:15 నుంచి)

వెబ్‌సైట్‌: ‌ www.esic.gov.in/recruitments/index/page:2 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని