నోటిఫికేషన్స్‌

21 ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ- పీహెచ్‌డీ (డ్యూయల్‌ డిగ్రీ) సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌-2024) ప్రకటన వెలువడింది.

Published : 14 Aug 2023 00:46 IST

ప్రవేశాలు

జామ్‌ - 2024

21 ఐఐటీల్లో ఎమ్మెస్సీ, ఎమ్మెస్సీ- పీహెచ్‌డీ (డ్యూయల్‌ డిగ్రీ) సీట్ల భర్తీకి నిర్వహించే జాయింట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ఫర్‌ మాస్టర్స్‌ (జామ్‌-2024) ప్రకటన వెలువడింది.

అర్హత: నిర్దేశిత విభాగాల్లో డిగ్రీ ఉత్తీర్ణులు. ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ అర్హులే.

సబ్జెక్టులు: బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, ఎకనామిక్స్‌, జియాలజీ, మ్యాథ్స్‌, మ్యాథమెటికల్‌ స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌.

దరఖాస్తు ఫీజు: మహిళలు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఒక పేపర్‌కి  రూ.900. రెండు పేపర్లకు రూ.1250. మిగిలిన అభ్యర్థులందరికీ ఒక పేపర్‌కు రూ.1800. రెండు పేపర్లకు రూ.2500

రిజిస్ట్రేషన్‌ ప్రారంభం: 05-09-2023.

రిజిస్ట్రేషన్‌ గడువు: 13-10-2023.

పరీక్ష తేదీ: 11-02-2024.

వెబ్‌సైట్‌: https://jam.iitm.ac.in/


ఆర్‌ఐఎంసీలో ప్రవేశాలు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఉత్తరాఖండ్‌ రాష్ట్రం దెహ్రాదూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్‌ మిలిటరీ కాలేజీ (ఆర్‌ఐఎంసీ)లో జులై- 2024 టర్మ్‌ ఎనిమిదో తరగతి ప్రవేశాలకు తెలంగాణ రాష్ట్రానికి చెందిన బాలురు, బాలికల నుంచి  టీఎస్‌పీఎస్సీ దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: గుర్తింపు పొందిన పాఠశాల నుంచి 2024 జులై నాటికి ఏడో తరగతి చదువుతున్న లేదా ఏడో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు.

వయసు: 01.07.2024 నాటికి పదకొండున్నర ఏళ్లకు తగ్గకుండా పదమూడేళ్లకు మించకుండా ఉండాలి.

ఎంపిక: రాత పరీక్ష, వైవా వోస్‌ ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులు రూ.555 చెల్లించాలి.

దరఖాస్తుకు చివరి తేదీ: 15.10.2023.

పరీక్ష తేదీ: 02-12-2023.

వెబ్‌సైట్‌: https://websitenew.tspsc.gov.in/public/rimc


ఏపీ కళాశాలల్లో డీఫార్మసీ

విజయవాడలోని ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య విభాగం నియంత్రణలోని ప్రభుత్వ/ ఎయిడెడ్‌/ ప్రైవేట్‌ అన్‌ ఎయిడెడ్‌ ఫార్మసీ కళాశాలల్లో 2023-24 విద్యా సంవత్సరానికి రెండేళ్ల డిప్లొమా ఇన్‌ ఫార్మసీ (డీఫార్మసీ) కోర్సు ప్రవేశ ప్రకటన వెలువడింది.  

అర్హత: ఇంటర్మీడియట్‌(బైపీసీ లేదా ఎంపీసీ) లేదా సీబీఎస్‌ఈ, ఐసీఎస్సీలో పన్నెండేళ్ల హయ్యర్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ బోర్డు ఎగ్జామ్‌ ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక: ఇంటర్‌ మార్కులు, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 19-08-2023.

తరగతుల ప్రారంభం: 11-09-2023.

వెబ్‌సైట్‌: https://apsbtet.in/pharmacy/


వాక్‌ ఇన్‌

నిట్‌ వరంగల్‌లో విజిటింగ్‌ ఫ్యాకల్టీ  

రంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ తాత్కాలిక ప్రాతిపదికన ఆగస్టు-డిసెంబర్‌ 2023 కాల పరిమితికి వివిధ విభాగాల్లో విజిటింగ్‌ ఫ్యాకల్టీ ఖాళీలను వాక్‌ ఇన్‌ ఇంటర్వ్యూ ద్వారా భర్తీ చేస్తోంది.

1. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

2. అసోసియేట్‌ ప్రొఫెసర్‌

3. ప్రొఫెసర్‌

అర్హత: సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ డిగ్రీ  

వయసు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ 40 సంవత్సరాలు; అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 45 సంవత్సరాలు; ప్రొఫెసర్‌ 50 సంవత్సరాలు మించకూడదు.

వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ తేదీ: 20.08.2023.

వెబ్‌సైట్‌: https://www.nitw.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని