Notifications: ఐఐఎం విశాఖపట్నంలో పీజీ

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్‌ (ఎంబీఏ)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 09 Jan 2024 05:58 IST

ప్రవేశాలు

విశాఖపట్నంలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ పీజీ ప్రోగ్రామ్‌ (ఎంబీఏ)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

వ్యవధి: రెండేళ్ల ఫుల్‌ టైం రెసిడెన్షియల్‌ ప్రోగ్రామ్‌. సీట్లు: 340.
అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ, క్యాట్‌ స్కోరు.
ప్రవేశం: విద్యార్హత మార్కులు, పని అనుభవం, క్యాట్‌ స్కోరు, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 29-02-2024.
ఇంటర్వ్యూ తేదీలు: 08-04-2024 నుంచి 30-04-2024.
వెబ్‌సైట్‌: www.iimv.ac.in/programs/pgp-abt-prgm


ఎన్‌ఎల్‌ఎస్‌యూ, బెంగళూరులో

బెంగళూరులోని నేషనల్‌ లా స్కూల్‌ ఆఫ్‌ ఇండియా యూనివర్సిటీ మూడేళ్ల ఎల్‌ఎల్‌బీ (ఆనర్స్‌) ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సీట్ల సంఖ్య: 120.
అర్హత: కనీసం 45% మార్కులతో ఏదైనా విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ.
ప్రవేశం: నేషనల్‌ లా స్కూల్‌ అడ్మిషన్స్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-02-2024.
ప్రవేశ పరీక్ష తేదీ: 17-03-2024.
తరగతుల ప్రారంభం: 01-07-2024.
వెబ్‌సైట్‌:https://www.nls.ac.in/programme/3-year-llb-hons/


మారిటైమ్‌ వర్సిటీలో ..

గాంధీనగర్‌లోని గుజరాత్‌ మారిటైమ్‌ యూనివర్సిటీ ఎంబీఏ, ఎల్‌ఎల్‌ఎం ప్రోగ్రామ్‌లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. ఎంబీఏ (షిప్పింగ్‌ అండ్‌ లాజిస్టిక్స్‌): 60 సీట్లు
అర్హత: ఏదైనా విభాగంలో బ్యాచిలర్స్‌ డిగ్రీ.
2. ఎల్‌ఎల్‌ఎం (మారిటైమ్‌ లా అండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రేడ్‌ లా): 30 సీట్లు
అర్హత: ఎల్‌ఎల్‌బీ/లాలో డిగ్రీ.
దరఖాస్తు రుసుము: జనరల్‌ కేటగిరీకి రూ.1000. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ కేటగిరీకి రూ.500.
దరఖాస్తుకు చివరి తేదీ: 05-06-2024.
ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేదీ: 09-06-2024.
వెబ్‌సైట్‌:https://gmu.edu.in/admission-open-2024-25/


నిక్‌మార్‌, హైదరాబాద్‌లో పీజీ

హైదరాబాద్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ ఫుల్‌ టైం ఆన్‌-క్యాంపస్‌ పీజీ ప్రోగ్రాంలలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.
1. పీజీ (అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌): రెండేళ్లు
2. పీజీ (అడ్వాన్స్‌డ్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్‌): రెండేళ్లు
3. పీజీ (క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌): రెండేళ్లు
4. పీజీ (హెల్త్‌, సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌): ఏడాది
5. పీజీ (లాజిస్టిక్స్‌ అండ్‌ సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్‌): ఏడాది
6. పీజీ (రియల్‌ ఎస్టేట్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌): ఏడాది
అర్హత: 50% మార్కులతో  బ్యాచిలర్‌ డిగ్రీ
ఎంపిక: నిక్‌మార్‌ కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌, గ్రూప్‌ డిస్కషన్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ, అప్లికేషన్‌ రేటింగ్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-01-2024.
ప్రవేశ పరీక్ష, గ్రూప్‌ డిస్కషన్‌, ఇంటర్వ్యూ: 12 నుంచి 18-02-2024 వరకు.
ఫలితాల వెల్లడి: 21-02-2024.
వెబ్‌సైట్‌:www.nicmar.ac.in/hyderabad/campus#secch3


అప్రెంటిస్‌షిప్‌

ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీలో...

గువాహటిలోని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా, నార్త్‌ ఈస్టర్న్‌ రీజియన్‌ వివిధ విమానాశ్రయాల్లో గ్రాడ్యుయేట్‌, డిప్లొమా, ఐటీఐ అప్రెంటిస్‌షిప్‌ శిక్షణ కోసం దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 85
విభాగాలు: సివిల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్‌/ ఐటీ/ కంప్యూటర్‌ సైన్స్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఫిట్టర్‌ (ఐటీఐ), మెకానిక్‌, డ్రాఫ్ట్స్‌మ్యాన్‌, ఎలక్ట్రీషియన్‌.
అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ డిప్లొమా/ ఐటీఐ.
వయసు: 31.12.2023 నాటికి 18 నుంచి 26 సంవత్సరాల మధ్య ఉండాలి.
స్టైపెండ్‌ (నెలకు): గ్రాడ్యుయేట్లకు రూ.15000, డిప్లొమా అభ్యర్థులకు రూ.12000. ఐటీఐ అభ్యర్థులకు రూ.9000.
ఎంపిక: విద్యార్హత మార్కులు, ఇంటర్వ్యూ, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15.01.2024.
వెబ్‌సైట్‌:https://www.aai.aero/


గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్లకు అప్రెంటిస్‌షిప్‌

బెంగళూరులోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) అప్రెంటిస్‌ శిక్షణలో భాగంగా గ్రాడ్యుయేట్‌ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన ఇంజినీరింగ్‌ అభ్యర్థులు జనవరి 16-20 తేదీల్లో వాక్‌ ఇన్‌ సెలక్షన్స్‌కు హాజరుకావచ్చు.
అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌.
స్టైపెండ్‌: నెలకు రూ.9000.
ఎంపిక: ఫస్ట్‌ కం ఫస్ట్‌ సర్వ్‌ బేసిస్‌, బీఈ, బీటెక్‌ మార్కుల ఆధారంగా.
వాక్‌ ఇన్‌ సెలక్షన్స్‌ తేదీలు: 16, 17, 18, 19, 20/01/2024.
వేదిక: టెక్నికల్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, సురంజన్‌ దాస్‌ రోడ్‌, బెంగళూరు.
వెబ్‌సైట్‌:https://hal-india.co.in//CAREERS/M__206


ప్రభుత్వ ఉద్యోగాలు

తపాలా శాఖలో స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌లు

కాన్పుర్‌లోని తపాలా శాఖకు చెందిన ఉత్తర్‌ప్రదేశ్‌ సర్కిల్‌ 78 స్టాఫ్‌ కార్‌ డ్రైవర్‌ (ఆర్డినరీ గ్రేడ్‌) ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
అర్హత: 10వ తరగతి. డ్రైవింగ్‌ లైసెన్స్‌తో పాటు మూడేళ్ల పని అనుభవం, మోటార్‌ మెకానిజంపై పరిజ్ఞానం.
వయసు: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: రాత పరీక్ష, డ్రైవింగ్‌ టెస్ట్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌ ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.100  
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘మేనేజర్‌, మెయిల్‌ మోటార్‌ సర్వీస్‌, జీపీవో కాంపౌండ్‌, కాన్పుర్‌’ చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 16-02-2024.
వెబ్‌సైట్‌:https://www.indiapost.gov.in/


ఎన్‌సీఎల్‌టీలో లా రిసెర్చ్‌ అసోసియేట్‌లు

న్యూదిల్లీలోని నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌- కాంట్రాక్టు ప్రాతిపదికన 24 లా రిసెర్చ్‌ అసోసియేట్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టింగ్‌ స్థలం: న్యూదిల్లీ, చెన్నై.
అర్హత: పీజీ (లా).
వయసు: 30 సంవత్సరాలు మించకూడదు.
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌ దరఖాస్తులను ‘ది రిజిస్ట్రార్‌, నేషనల్‌ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌, 3వ అంతస్తు, మహానగర్‌ దూరసంచార్‌ సదన్‌, లోధి రోడ్‌, న్యూదిలీ’్ల చిరునామాకు పంపించాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 07-03-2024.
వెబ్‌సైట్‌:https://nclat.nic.in/


సెయిల్‌లో అటెండెంట్‌ కమ్‌ టెక్నీషియన్‌లు

బర్న్‌పూర్‌ (పశ్చిమ బెంగాల్‌)లోని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌)- ఐఐఎస్‌సీవో స్టీల్‌ ప్లాంట్‌ నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ గ్రేడ్‌లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
1. అటెండెంట్‌-కమ్‌-టెక్నీషియన్‌ (ట్రైనీ): 40
2. ఆపరేటర్‌-కమ్‌-టెక్నీషియన్‌ (బాయిలర్‌ ఆపరేషన్‌) (ఎస్‌-3): 03
3. అటెండెంట్‌-కమ్‌-టెక్నీషియన్‌ (బాయిలర్‌ అటెండెంట్‌)(ఎస్‌-1): 03
అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, హెవీ మోటార్‌ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌.
వయసు: 18/01/2024 నాటికి ఆపరేటర్‌-కమ్‌ టెక్నీషియన్‌కు 30 ఏళ్లు; అటెండెంట్‌-కమ్‌ టెక్నీషియన్‌కు 28 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: రాత పరీక్ష/ స్కిల్‌ టెస్ట్‌/ ట్రేడ్‌ టెస్ట్‌, సర్టిఫికేట్‌ వెరిఫికేషన్‌, మెడికల్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 18/01/2024.
వెబ్‌సైట్‌:https://sailcareers.com/


ట్రైనీ ఇంజినీర్‌, ట్రైనీ ఆఫీసర్‌ పోస్టులు

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని నేషనల్‌ హైడ్రో ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (ఎన్‌హెచ్‌పీసీ) 98 ట్రైనీ ఇంజనీర్‌, ట్రైనీ ఆఫీసర్‌ పోస్టుల భర్తీకి స్పెషల్‌ రిక్రూట్‌మెంట్‌ డ్రైవ్‌ నిర్వహిస్తోంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
1. ట్రైనీ ఇంజినీర్‌ (సివిల్‌): 22  
2. ట్రైనీ ఇంజినీర్‌ (ఎలక్ట్రికల్‌): 17
3. ట్రైనీ ఇంజినీర్‌ (మెకానికల్‌): 50  
4. ట్రైనీ ఆఫీసర్‌ (ఫైనాన్స్‌): 09  
అర్హత: సంబంధిత విభాగంలో బీఎస్సీ, బీఈ, బీటెక్‌, సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎంఏతో పాటు గేట్‌, సీఏ/ సీఎంఏ స్కోరు.
వయసు: 22-01-2024 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు.
ఎంపిక: గేట్‌, సీఏ/ సీఎంఏ స్కోరు, ధ్రువపత్రాల పరిశీలన, వైద్య పరీక్షల ఆధారంగా.
దరఖాస్తు రుసుము: రూ.295 (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది).
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-01-2024.
వెబ్‌సైట్‌:http://www.nhpcindia.com/
ఆన్‌లైన్‌ దరఖాస్తు: https://intranet.nhpc.in/rectt34/


స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌లో సైంటిస్ట్‌లు

అహ్మదాబాద్‌లోని ఇస్రో- స్పేస్‌ అప్లికేషన్స్‌ సెంటర్‌ కింది విభాగాల్లో 19 సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.  
1. సైంటిస్ట్‌/ ఇంజినీర్‌-ఎస్సీ   (అగ్రి): 08
2. సైంటిస్ట్‌/ ఇంజినీర్‌- ఎస్సీ (అట్మాస్ఫియరిక్‌ సైన్సెస్‌ ఖీ ఓషనోగ్రఫీ): 08
3. సైంటిస్ట్‌/ ఇంజినీర్‌- ఎస్సీ (కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌): 03
అర్హత: సంబంధిత విభాగంలో ఎమ్మెస్సీ, ఎంఈ, ఎంటెక్‌.  
ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌, దరఖాస్తుకు చివరి తేదీ: 15.01.2024.
వెబ్‌సైట్‌: https://careers.sac.gov.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని