ప్రభుత్వ ఉద్యోగాలు

రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (రైట్స్‌) 16 అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 24 Jan 2024 04:39 IST

రైట్స్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

రైల్‌ ఇండియా టెక్నికల్‌ అండ్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ (రైట్స్‌) 16 అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఫైనాన్స్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: చార్టర్డ్‌ అకౌంటెన్సీ/ కాస్ట్‌ అకౌంటెన్సీతో పాటు 2 ఏళ్ల పని అనుభవం. వయసు: 32 ఏళ్లు మించరాదు.

దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఇతరులకు రూ.600.

ఎంపిక: రాత పరీక్ష, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా ఆన్‌లైన్‌ ఫీజుకు చివరి తేదీ: 29-01-2024

రాత పరీక్ష తేదీ: 04-02-2024

మరో 12 కొలువులు  

రైట్స్‌ సంస్థ 12 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

అసిస్టెంట్‌ మేనేజర్‌ (జియో టెక్నికల్‌): 01  
అసిస్టెంట్‌ మేనేజర్‌ (స్ట్రక్చరల్‌ ఇంజినీరింగ్‌): 04
అసిస్టెంట్‌ మేనేజర్‌ (అర్బన్‌ ఇంజినీరింగ్‌): 03  
అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎలక్ట్రికల్‌): 01
అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎస్‌ అండ్‌ టీ): 01  
అసిస్టెంట్‌ మేనేజర్‌ (ఎకనామిక్‌ అండ్‌ స్టాటిస్టిక్స్‌): 01
అసిస్టెంట్‌ మేనేజర్‌ (సివిల్‌): 01  

అర్హత: పోస్టును అనుసరించి డిగ్రీలో సివిల్‌, ఎన్విరాన్‌మెంటల్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎకనామిక్స్‌, బిజినెస్‌ ఎకనామిక్స్‌. పీజీలో జియో-టెక్నికల్‌, స్ట్రక్చరల్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజినీరింగ్‌, ఎంబీఏ (ఫైనాన్స్‌)తో పాటు 2 ఏళ్ల పని అనుభవం.
వయసు: 32 ఏళ్లు మించరాదు.
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.300, ఇతరులకు రూ.600.
ఎంపిక: రాత పరీక్ష, షార్ట్‌లిస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు: ఆన్‌లైన్‌ ద్వారా
ఆన్‌లైన్‌ ఫీజుకు చివరి తేదీ: 27-01-2024
రాత పరీక్ష తేదీ: 04-02-2024 పరీక్ష కేంద్రం: దిల్లీ-ఎన్‌సీఆర్‌
వెబ్‌సైట్‌: https://rites.com/


ఎన్‌ఆర్‌ఎస్‌సీలో సైంటిస్ట్‌ ఇంజినీర్‌లు

నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్‌ (ఎన్‌ఆర్‌ఎస్‌సీ) 41 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్సీ’ (అగ్రికల్చర్‌): 02
సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్సీ’ (ఫారెస్ట్రీ ఎకానమీ): 04  
సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్సీ’ (జియో ఇన్ఫర్మేటిక్‌): 07  
సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్సీ’ (జియాలజీ): 04
సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్సీ’ (జియో ఫిజిక్స్‌): 04
సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్సీ’ (సాయిల్‌ సైన్స్‌): 04
సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్సీ’ (అర్బన్‌ స్టడీస్‌) 03
సైంటిస్ట్‌/ ఇంజినీర్‌ ‘ఎస్సీ’ (వాటర్‌ రిసోర్సెస్‌): 07
మెడికల్‌ ఆఫిసర్‌ ‘ఎస్సీ’: 01  
నర్స్‌ ‘బీ’: 02  
లైబ్రరీ అసిస్టెంట్‌ ‘ఏ’: 03

అర్హత: సంబంధిత పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌ఎల్‌సీ/ ఎస్‌ఎస్‌సీ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ, బీటెక్‌ ఎమ్మెస్సీ,

ఎంటెక్‌, ఎంఈ. వయసు: 18 - 35 ఏళ్లు మించరాదు.

దరఖాస్తు ఫీజు: రూ. 750

ఎంపిక: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-02-2024

వెబ్‌సైట్‌: https://www.nrsc.gov.in/


ప్రవేశాలు

యూపీఈఎస్‌లో యూజీ, పీజీ

యూనివర్సిటీ ఆఫ్‌ పెట్రోలియం అండ్‌ ఎనర్జీ స్టడీస్‌ (యూపీఈఎస్‌).. కింది విభాగాల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సులు: బీఏ, బీఎస్సీ, ఎంటెక్‌, బీకాం, బీసీఏ, ఎంసీఏ, ఎల్‌ఎల్‌బీ, బీడీఎస్‌, ఎంబీఏ, పీహెచ్‌డీ.

అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్‌, డిప్లొమా, డిగ్రీ.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: ఎంబీఏ ప్రవేశానికి 24-01-2024, ఇతర ప్రవేశాలకు 28-01-2024

వెబ్‌సైట్‌: https://www.upes.ac.in/


ఎన్‌పీటీఐలో ఎంబీఏ ప్రోగ్రామ్‌

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2024-26 విద్యాసంవత్సరానికి రెండేళ్ల ఎంబీఏ ప్రోగ్రామ్‌ (పవర్‌ మేనేజ్‌మెంట్‌)లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అర్హత: కనీసం 60% మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు క్యాట్‌/ సీమ్యాట్‌/ మ్యాట్‌/ ఎక్స్‌ఏటీ/ జీమ్యాట్‌ స్కోరు లేదా ఎన్‌పీటీఐ అడ్మిషన్‌ టెస్ట్‌ స్కోరు.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-03-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 12-03-2024.

ఫలితాల ప్రకటన: 19-03-2024.

వెబ్‌సైట్‌:  https://npti.gov.in/mba-power-management


ఎన్‌పీటీఐలో పీజీ డిప్లొమా కోర్సులు

హరియాణా రాష్ట్రం ఫరీదాబాద్‌లోని నేషనల్‌ పవర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ 2024-25 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ఎన్‌పీటీఐ ఇన్‌స్టిట్యూట్‌: ఫరీదాబాద్‌, నాగ్‌పుర్‌, నైవేలి, బదర్‌పూర్‌, న్యూదిల్లీ, శివ్‌పురి, బెంగళూరు.

1. పీజీ డిప్లొమా ఇన్‌ పవర్‌ ప్లాంట్‌ ఇంజినీరింగ్‌: 240 సీట్లు

2. పీజీ డిప్లొమా ఇన్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ - గ్రిడ్‌ ఇంటర్‌ఫేస్‌ టెక్నాలజీస్‌: 120 సీట్లు

కోర్సు వ్యవధి: ఒక ఏడాది (రెండు సెమిస్టర్లు)

అర్హత: కనీసం 60% మార్కులతో సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్‌.

వయః పరిమితి: లేదు.

ఎంపిక: డిగ్రీ మార్కులు, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 22-02-2024.

వెబ్‌సైట్‌: https://npti.gov.in/pgdc-prospectus-winter-2024-25


వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ఎమ్మెస్సీ

దేహ్రాదూన్‌లోని వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా ఎంఎస్సీ (ఫ్రెష్‌ వాటర్‌ ఎకాలజీ అండ్‌ కన్జర్వేషన్‌) కోర్సు ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: లైఫ్‌ సైన్స్‌ బ్యాచిలర్‌ డిగ్రీ (బోటనీ, జువాలజీ, వైల్డ్‌లైఫ్‌ సైన్సెస్‌/ ఫారెస్ట్రీ సబ్జెక్టుల్లో ఒకటి) లేదా వెటర్నరీ సైన్స్‌, అగ్రికల్చర్‌, బయోడైవర్సిటీ అండ్‌ కన్జర్వేషన్‌ సైన్స్‌, సస్టెయినబుల్‌ డెవలప్‌మెంట్‌, బయోటెక్నాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ అనుబంధ సబ్జెక్టుల్లో డిగ్రీ.

వయసు: మార్చి 30, 2024 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: నెట్‌ స్కోరు, పర్సనాలిటీ, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 30-03-2024.

వైల్డ్‌లైఫ్‌ సైన్స్‌లో పీజీ

వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా  ఎమ్మెస్సీ (వైల్డ్‌లైఫ్‌ సైన్స్‌) కోర్సులో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: బ్యాచిలర్‌ డిగ్రీ (లైఫ్‌ సైన్సెస్‌, మెడికల్‌ సైన్స్‌, ఇంజినీరింగ్‌, వెటర్నరీ సైన్స్‌, అగ్రికల్చర్‌, ఫారెస్ట్రీ, ఫార్మసీ, సోషల్‌ సైన్సెస్‌, కంప్యూటర్‌ సైన్స్‌).

వయసు: మార్చి 30, 2024 నాటికి 25 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: నెట్‌ స్కోరు, పర్సనాలిటీ, ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ గడువు: 30-03-2024.

వెబ్‌సైట్‌: https://wii.gov.in/ 


అప్రెంటిస్‌షిప్‌

టీఎస్‌ఆర్టీసీలో గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌షిప్‌లు

టీఎస్‌ఆర్టీసీ... వివిధ టీఎస్‌ఆర్టీసీ రీజియన్లలో (డిపో/ యూనిట్‌) నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో అప్రెంటిస్‌ శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. బీఏ, బీకాం, బీబీఏ, బీసీఏ పట్టభద్రులు నాన్‌ ఇంజినీరింగ్‌ విభాగానికి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు.

ఖాళీలు: 150

రీజియన్ల వారీ: హైదరాబాద్‌- 26, సికింద్రాబాద్‌- 18,

మహబూబ్‌ నగర్‌- 14, మెదక్‌- 12, నల్గొండ- 12, రంగారెడ్డి- 12, ఆదిలాబాద్‌- 09, కరీంనగర్‌- 15, ఖమ్మం- 09, నిజామాబాద్‌- 09, వరంగల్‌- 14.

అర్హత: బీకాం, బీఎస్సీ, బీఏ, బీబీఏ, బీసీఏ కోర్సు 2018-2023 మధ్య విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి. శిక్షణ వ్యవధి: మూడేళ్లు.

స్ట్టైపెండ్‌: మొదటి, రెండు, మూడు సంవత్సరాలకు వరుసగా నెలకు రూ.15000, రూ.16000, రూ.17000.

ఎంపిక: విద్యార్హతలు, ధ్రువపత్రాల పరిశీలన, స్థానికత, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు: దరఖాస్తు సమర్పణకు ముందు  www.nats.education.gov.in వెబ్‌సైట్‌లో  వివరాలను నమోదు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 16-02-2024.

వెబ్‌సైట్‌: www.tsrtc.telangana.gov.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని