Stock market: భారీ లాభాల్లో సూచీలు.. సెన్సెక్స్‌ 900+, నిఫ్టీ 220+

Stock market: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 941 పాయింట్లు, నిఫ్టీ 223 పాయింట్లు చొప్పున లాభపడ్డాయి.

Published : 29 Apr 2024 16:17 IST

Stock market | ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు భారీ లాభాల్లో ముగిశాయి. గత వారమంతా దాదాపు లాభాల్లో కొనసాగిన సూచీలకు చివరి ట్రేడింగ్ సెషన్‌లో నష్టాలు ఎదురయ్యాయి. ఒక్కరోజు విరామం తర్వాత సూచీలు మళ్లీ భారీగా పుంజుకున్నాయి. ప్రపంచ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, బ్యాంకింగ్‌ షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో దూసుకెళ్లాయి. ఈక్రమంలో సెన్సెక్స్‌ 900కు పైగా పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 22,600 పాయింట్ల మార్కు ఎగువన ముగిసింది.

సెన్సెక్స్‌ ఉదయం 73,982.75 లాభాల్లో ప్రారంభమై ఆద్యంతం అదే ఒరవడి కొనసాగింది. ఇంట్రాడేలో 74,721.15 వద్ద గరిష్ఠాన్ని తాకిన సూచీ.. చివరికి 941.12 పాయింట్లు లాభపడి 74,671.28 వద్ద ముగిసింది. నిఫ్టీ 223.45 పాయింట్ల లాభంతో 22,643.40 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ 83.48గా ఉంది. సెన్సెక్స్‌లో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీ, ఐటీసీ, విప్రో, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ మినహా అన్ని షేర్లూ లాభపడ్డాయి. అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 88.90గా ఉంది.

సూచీల జోరుకు కారణమిదే..

  • సూచీలు రాణించడంలో ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ ప్రధాన పాత్ర పోషించాయి. మెరుగైన త్రైమాసిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో ఐసీఐసీఐ షేర్లు రాణించగా.. ఫలితాల నేపథ్యంలో ఎస్‌బీఐ షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించింది.
  • అంతర్జాతీయ మార్కెట్లు రాణించడమూ దేశీయ స్టాక్‌మార్కెట్‌ సూచీల లాభాల పరుగుకు మరో కారణం. ఆసియా మార్కెట్లు దాదాపు లాభాల్లో ముగియగా.. యూరోపియన్‌ మార్కెట్లు సైతం సోమవారం లాభాల్లో ప్రారంభమయ్యాయి. బుధవారం వెల్లడయ్యే అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ నిర్ణయాలపై మదుపరుల్లో ఆసక్తి నెలకొంది.
  • పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గడం కూడా మార్కెట్లపై సెంటిమెంట్‌కు కారణమైంది. ఇజ్రాయెల్‌- ఇరాన్‌ మధ్య ఘర్షణలు తగ్గడం వల్ల అటు క్రూడాయిల్‌ ధరలు సైతం కొంతమేర క్షీణించాయి.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు