నోటీస్‌బోర్డు

కోల్‌ ఇండియాలో మెడికల్‌ స్పెషలిస్టులు

Published : 18 Mar 2024 00:40 IST

పభుత్వ ఉద్యోగాలు
కోల్‌ ఇండియాలో మెడికల్‌ స్పెషలిస్టులు  
 

కోల్‌ ఇండియా లిమిటెడ్‌, కోల్‌కతా - 72 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
1. (ఎ) మెడికల్‌ స్పెషలిస్ట్‌
2. (బి) మెడికల్‌ స్పెషలిస్ట్‌
3. సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఎంబీబీఎస్‌, పీజీ డిగ్రీ, డీఎన్‌బీ ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీలో చదివి ఉండాలి.
వయసు: సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు 42 ఏళ్ల లోపు, సీనియర్‌ మెడికల్‌ ఆఫీసర్‌ /మెడికల్‌ స్పెషలిస్ట్‌ 35 ఏళ్ల లోపు ఉండాలి. (ఓబీసీ అభ్యర్థులకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు సడలింపు ఉంటుంది).
వేతనం: నెలకు సీనియర్‌ మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.70,000 నుంచి రూ.2,00,000, మెడికల్‌ స్పెషలిస్ట్‌ పోస్టుకు రూ.60,000 - రూ.1,80,000, మెడికల్‌ ఆఫీసర్‌ పోస్టుకు రూ.60,000 - రూ.1,80,000.
దరఖాస్తుకు చివరి తేదీ: 11-04-2024

  • దరఖాస్తును స్పీడ్‌ పోస్టు ద్వారా పంపాలి.

చిరునామా: ద జనరల్‌ మేనేజర్‌ (పర్సనల్‌)/హెచ్‌ఒడి (ఈఈ), ఎగ్జిక్యూటివ్‌ ఎస్ట్టాబ్లిష్‌మెంట్‌ డిపార్ట్‌మెంట్‌, 2 ఫ్లోర్‌, కోల్‌ ఎస్టేట్‌, వెస్టర్న్‌ కోల్‌ ఫీల్డ్స్‌ లిమిటెడ్‌, సివిల్‌ లైన్స్‌, నాగ్‌పూర్‌, మహారాష్ట్ర - 440001
వెబ్‌సైట్‌:https://www.coalindia.in/career-cil/jobs-coal-india/


వాక్‌-ఇన్‌

కేంద్రీయ విద్యాలయంలో టీచింగ్‌ పోస్టులు

కేంద్రీయ విద్యాలయ, హకీమ్‌పేట్‌, బొల్లారం - ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
1. పీజీటీ 2. పీఆర్‌టీ 3. స్పోర్ట్స్‌ కోచ్‌ 4. డాక్టర్‌ 5. స్టాఫ్‌ నర్స్‌ 6. కౌన్సెలర్‌ 7. యోగా కోచ్‌ 8. డాన్స్‌ కోచ్‌ 9. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ 10. స్పెషల్‌ ఎడ్యుకేటర్‌ 11. బాల్‌వాటికా టీచర్స్‌ 12. కంప్యూటర్‌ ఇన్‌స్ట్రక్టర్స్‌  
సబ్జెక్టులు: పీజీటీ పోస్టుకు హిందీ, ఇంగ్లిష్‌, గణితం, ఫిజిక్స్‌, బయాలజీ, కెమిస్ట్రీ, హిస్టరీ, జాగ్రఫీÆ, ఎకనామిక్స్‌, కామర్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్స్‌.
టీజిటీ పోస్టుకు: హిందీ, ఇంగ్లిష్‌, సంస్కృతం, గణితం, సైన్స్‌, సోషల్‌ సైన్స్‌.
అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీ, డిప్లొమా, మాస్టర్‌ డిగ్రీ, ఎమ్మెస్సీ, బీఎస్సీ, పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌, బీఈ, బీటెక్‌, ఎంసీఏ, బీసీఏ, డిఇఈఏసీసీ. ఇంటర్వ్యూ తేదీలు: మార్చి 21, 22
ప్రదేశం:  కేవీ బొల్లారం, ఆలెన్‌బై లైన్స్‌, జేజే నగర్‌, యాప్రాల్‌, సికిందరాబాద్‌ .
వెబ్‌సైట్‌: https://hakimpet.kvs.ac.in/school-announcement


ప్రవేశాలు

సమ్మక్క సారక్క గిరిజన విశ్వవిద్యాలయంలో..

ములుగులోని సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయంలో 2024-25 విద్యా సంవత్సరానికి కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు..  
1. బీఏ ఇంగ్లిష్‌ (ఆనర్స్‌): 25+8 సీట్లు
అర్హత: కనీసం 60% మార్కులతో ప్లస్‌ టు (ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా).
2. బీఏ సోషల్‌ సైన్సెస్‌ (ఆనర్స్‌): 25+8 సీట్లు
అర్హత: ఏదైనా స్ట్రీమ్‌లో కనీసం 60% మార్కులతో ప్లస్‌ టు (ఇంగ్లిష్‌ ఒక సబ్జెక్టుగా).. సెమిస్టర్లు: 8. వ్యవధి: నాలుగేళ్లు.
ప్రవేశం: నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ నిర్వహించే సీయూఈటీ- యూజీ 2024 ప్రవేశ పరీక్ష, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ ఫీజు: జనరల్‌ కేటగిరీకి రూ.600. ఈడబ్ల్యూఎస్‌ కేటగిరీకి రూ.550. ఓబీసీ- ఎన్‌సీఎల్‌ కేటగిరీకి రూ.400. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ కేటగిరీకి రూ.275. సీయూఈటీ- యూజీ 2024 దరఖాస్తుకు చివరి తేదీ: 26-03-2024.
పరీక్ష: మే 15- 31 తేదీల్లో. ఫలితాల వెల్లడి: 30-06-2024.
వెబ్‌సైట్‌:https://ssctu.ac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు