నోటీస్‌బోర్డు

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ వివిధ కోర్సుల్లో డిగ్రీ మొదటి సంవత్సరానికి మహాత్మా జ్యోతిభా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ,

Updated : 20 Mar 2024 00:20 IST

ప్రవేశాలు

తెలంగాణ రెసిడెన్షియల్‌ డిగ్రీ కాలేజీలో ...

తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ సొసైటీ వివిధ కోర్సుల్లో డిగ్రీ మొదటి సంవత్సరానికి మహాత్మా జ్యోతిభా ఫులే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ, తెలంగాణ సాంఘిక సంక్షేమ, తెలంగాణ గిరిజన సంక్షేమ రెసిడెన్షియల్‌ డిగ్రీ కళాశాల్లో ప్రవేశానికి 2024-25 విద్యా సంవత్సరానికి దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు:

బీఎస్సీ (ఎంపీసీ/ఎంఎస్‌సీఎస్‌/ ఎంబీజెడ్‌సీ/ ఎంపీజీ/ ఎంసీసీఎస్‌/ బీటీటీసీసీ/ బీబీసీసీ/ ఎన్‌జడ్‌సీ/ బీజడ్‌జీ/ ఎంఎస్‌డీఎస్‌/ ఎంఎస్‌ఏఐ అండ్‌ ఎంఎల్‌/ ఏఎన్‌పీహెచ్‌బీసీ) బీకాం, బీఏ/ సీఏ/ జనరల్‌), బీఏ (ఈపీహెచ్‌/ హెచ్‌పీసీ/ ఈపీఎస్‌పీఏ/ హెచ్‌ఈసీ/ ఐఆర్‌ఈపీ/ పీపీజీఈపీ), బీహెచ్‌ఎంసీటీ,
అర్హత: ఇంటర్‌ లేదా తత్సమాన విద్యార్హత.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-04-2024.
పరీక్ష తేదీ: 28-04-2024.
వెబ్‌సైట్‌: https://tswreis.ac.in/


ఏపీ బీసీ గురుకులాల్లో ఇంటర్‌  

విజయవాడలోని మహాత్మా జ్యోతిబా ఫులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ నిర్వహించే 18 బీసీ బాలబాలికల జూనియర్‌ కళాశాలల్లో 2024-25 విద్యాసంవత్సరానికి ఇంటర్మీడియట్‌ (ఇంగ్లిష్‌ మీడియం)లో ప్రవేశాల ప్రకటన వెలువడింది.  

మహాత్మా జ్యోతిబా ఫులే ఏపీ బీసీ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజెస్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌-2024

గ్రూపులు: ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ.
బాలుర సీట్లు: 1,300 (ఎంపీసీ- 500, బైపీసీ- 360, ఎంఈసీ- 160, సీఈసీ- 280)
బాలికల సీట్లు: 1,300 (ఎంపీసీ- 500, బైపీసీ- 360, ఎంఈసీ- 160, సీఈసీ- 280)
మొత్తం సీట్లు: 2,600.
విద్యార్హత: విద్యార్ధులు సంబంధిత జిల్లాల్లోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలలో పదో తరగతి మార్చి 2024 ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకూడదు.
వయసు: 31.08.2024 నాటికి 17 ఏళ్లు మించకూడదు.
ఎంపిక: ప్రవేశ పరీక్షలో ప్రతిభ, రిజర్వేషన్‌, ప్రత్యేక కేటగిరీ (అనాథ/ మత్స్యకార) ఆధారంగా సీటు కేటాయిస్తారు.
దరఖాస్తు రుసుము: రూ.250.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 31-03-2024.
ప్రవేశ పరీక్ష: 13-04-2024.
వెబ్‌సైట్‌: https://mjpapbcwreis.apcfss.in/


కాన్పూర్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌లో ...

నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌, కాన్పూర్‌ కింది కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

కోర్సుల వివరాలు:

  • పీజీ డిప్లొమా కోర్స్‌ ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ
  • పీజీ డిప్లొమా కోర్స్‌ ఆఫ్‌ అసోసియేట్‌షిప్‌ ఆఫ్‌ నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఇన్‌ షుగర్‌ ఇంజినీరింగ్‌
  • పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ ఇండస్ట్రియల్‌ ఫెర్మెంటేషన్‌ అండ్‌ ఆల్కహాల్‌ టెక్నాలజీ
  • పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ షుగర్‌కేన్‌ ప్రొడక్టివిటీ అండ్‌ మినిస్ట్రీ మేనేజ్‌మెంట్‌
  • పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ప్రాసెస్‌ కంట్రోల్‌
  • పీజీ డిప్లొమా కోర్స్‌ ఇన్‌ క్వాలిటీ కంట్రోల్‌ అండ్‌ ఎన్విరాన్మెంటల్‌ సైన్స్‌
  • షుగర్‌ బాయిలింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు
  • షుగర్‌ ఇంజినీరింగ్‌ సర్టిఫికెట్‌ కోర్సు
  • సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ క్వాలిటీ కంట్రోల్‌
  • ఫెలోషిప్‌ ఆఫ్‌ ఎన్‌.ఎస్‌.ఐ. ఇన్‌ షుగర్‌ టెక్నాలజీ / షుగర్‌ కెమిస్ట్రీ
  • ఫెలోషిప్‌ ఆఫ్‌ ఎన్‌.ఎస్‌.ఐ. ఇన్‌ షుగర్‌ ఇంజినీరింగ్‌
  • ఫెలోషిప్‌ ఆఫ్‌ ఎన్‌.ఎస్‌.ఐ. ఇన్‌ ఫెర్మెంటేషన్‌ టెక్నాలజీ

అర్హత: కోర్సులను అనుసరించి సంబంధిత విభాగాల్లో ఇంటర్‌, డిప్లొమా, బీఎస్సీ, ఏఎంఐఈ, ఏఎన్‌ఎస్‌ఐ, డీఐఏటీ.
ఎంపిక: అడ్మిషన్‌ టెస్ట్‌ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం: 08-04-2024.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-05-2024.
పోస్టు ద్వారా దరఖాస్తులకు చివరి తేదీ: 31-05-2024.
చిరునామా: డైరెక్టర్‌, నేషనల్‌ షుగర్‌ ఇన్‌స్టిట్యూట్‌, కళ్యాన్‌పుర్‌, కాన్పూర్‌.
దరఖాస్తు ఫీజు: రూ.1500, ఎస్సీ/ఎస్టీలకు రూ.1000.
అడ్మిన్‌ కార్డుల డౌన్‌లోడ్‌: జూన్‌ 16 నుంచి.
వెబ్‌సైట్‌: https://nsi.gov.in/


అలెన్‌ స్కాలర్‌షిప్‌ అడ్మిషన్‌ టెస్టులు

రాజస్థాన్‌ కోటాకు చెందిన అలెన్‌ కెరియర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ అలెన్‌ స్కాలర్‌షిప్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (ఏశాట్‌) ప్రకటన విడుదల చేసింది. 11వ తరగతిలో చేరే విద్యార్థులకు ఈ పరీక్షను మార్చి 24న నిర్వహిస్తారు. వీరికి మార్చి 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. ఆ తర్వాత బ్యాచ్‌లకు మార్చి 31, ఏప్రిల్‌లో స్కాలర్‌షిప్‌ అడ్మిషన్‌ టెస్టులు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన కొన్ని నగరాల్లో నిర్వహిస్తామని సంస్థ డైరెక్టర్‌ బ్రజేష్‌ మహేశ్వరి తెలిపారు. ఈ పరీక్షలో చూపిన ప్రతిభతో ఫీజులో పది శాతం నుంచి తొంభై శాతం వరకు రాయితీ కల్పిస్తారు. సంస్థ వెబ్‌సైట్‌ www.allen.ac.in నుంచి పూర్తి వివరాలు పొందవచ్చు.


సింగరేణిలో మేనేజ్‌మెంట్‌ ట్రెయినీలు

ద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెంలోని సింగరేణి కాలరీస్‌ కంపెనీ లిమిటెడ్‌ - 327 వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఈ అండ్‌ ఎమ్‌): 42
  • మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (సిస్టమ్స్‌) 07
  • జూనియర్‌ మైనింగ్‌ ఇంజినీర్‌ ట్రెయినీ (జేఎమ్‌ఈటీ) టీ, ఎస్‌: 100
  • అసిస్టెంట్‌ ఫోర్‌మాన్‌ ట్రెయినీ (మెకానికల్‌) టీ, ఎస్‌: 09
  • అసిస్టెంట్‌ ఫోర్‌మాన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) టీ, ఎస్‌: 24
  • ఫిట్టర్‌ ట్రెయినీ: 47
  • ఎలక్ట్రీషియన్‌ ట్రెయినీ: 98

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ.
వయసు: 30 సంవత్సరాల లోపు ఉండాలి. (ఎస్సీ, ఎస్టీ, బీసీ పీడబ్ల్యూడీలకు ఐదేళ్ల సడలింపు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04-05-2024
వెబ్‌సైట్‌: https://scclmines.com/scclnew/index.asp


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని