నోటీస్‌బోర్డు

సెక్యూరిటీస్‌ ఆండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా, ముంబయి - 97 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 21 Mar 2024 00:17 IST

ప్రభుత్వ ఉద్యోగాలు
సెబీలో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు

సెక్యూరిటీస్‌ ఆండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇండియా, ముంబయి - 97 అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: జనరల్‌, లీగల్‌, ఇన్‌ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజినీరింగ్‌ (ఎలక్ట్రికల్‌), రిసెర్చ్‌, అఫీషియల్‌ లాంగ్వేజ్‌.

అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో మాస్టర్‌, బ్యాచిలర్‌ డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా, ఇంజినీరింగ్‌, లా.

వయసు: 30 సంవత్సరాలు మించరాదు.

దరఖాస్తు ప్రారంభ తేదీ: 13-04-2024

దరఖాస్తు చివరి తేదీ: ప్రకటించలేదు.

వెబ్‌సైట్‌: https://www.sebi.gov.in/sebiweb/about/AboutAction.do?doVacancies=yes


ఐఐటీ తిరుపతిలో నాన్‌ టీచింగ్‌ ఖాళీలు  

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 8 నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • స్టూడెంట్‌ కౌన్సెలర్‌: 01
  • హిందీ ట్రాన్స్‌లేటర్‌: 01  
  • జూనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌: 01
  • జూనియర్‌ అసిస్టెంట్‌: 03  
  • జూనియర్‌ టెక్నీషియన్‌: 02  

అర్హత: పోస్టును అనుసరించి ఇంటర్‌, ఐటీఐ, డిప్లొమా లేదా తత్సమానం, డిగ్రీ, బీఈ, బీటెక్‌ (మెకానికల్‌ ఇంజినీరింగ్‌), పీజీ, జనరల్‌ నర్సింగ్‌తో పాటు పని అనుభవం.
వేతనం: స్టూడెంట్‌ కౌన్సెలర్‌కు రూ.56,100 నుంచి రూ.1,77,550. హిందీ ట్రాన్స్‌లేటర్‌/జూనియర్‌ నర్సింగ్‌ ఆఫీసర్‌కు రూ.35,400 నుంచి రూ.1,12,400. జూనియర్‌ అసిస్టెంట్‌/ జూనియర్‌ టెక్నీషియన్‌కు రూ. 25,500 నుంచి రూ.81,100.
ఎంపిక: స్క్రీనింగ్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ, స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: గ్రూప్‌-ఏ పోస్టులకు రూ.500. గ్రూప్‌-బీ పోస్టులకు రూ.300. గ్రూప్‌-సీ పోస్టులకు రూ.200.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 11-04-2024.

వెబ్‌సైట్‌: https://www.iittp.ac.in/


ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్‌లో టెక్నీషియన్‌లు

హైదరాబాదులోని నేషనల్‌ యానిమల్‌ రిసోర్స్‌ ఫెసిలిటీ ఫర్‌ బయో మెడికల్‌ రిసెర్చ్‌ (ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్‌) డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ప్రాతిపదికన 3 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

  • టెక్నీషియన్‌-1: 02
  • ల్యాబ్‌ అటెండెంట్‌-1: 01  

అర్హత: పోస్టులకు సంబంధించి అర్హత, వయసు పరిమితి, తదితర  పూర్తి వివరాలు ఎన్‌ఏఆర్‌ఎఫ్‌బీఆర్‌ వెబ్‌సైట్‌లో చూడవచ్చు.

దరఖాస్తుకు చివరి తేదీ: ఏప్రిల్‌ 15న వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.

వెబ్‌సైట్‌:  https://narfbr.org/


ప్రవేశాలు

ఐఐటీ తిరుపతిలో ఎంఎస్‌, పీహెచ్‌డీ  

తిరుపతిలోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ 2024-25 విద్యాసంవత్సరానికి కింది కోర్సుల ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

1. ఎంఎస్‌/ పీహెచ్‌డీ

2. పీహెచ్‌డీ (ఇంజినీరింగ్‌, సైన్సెస్‌, హ్యుమానిటీస్‌ఖీ సోషల్‌ సైన్సెస్‌)

3. ఎంఎస్‌ (ఆర్‌) మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ రిసెర్చ్‌ ఇన్‌ ఇంజినీరింగ్‌

అర్హత: సంబంధిత కోర్సును అనుసరించి యూజీ, పీజీ. ఎంఈ/ ఎంటెక్‌, బీఎస్‌/ బీఈ/ బీటెక్‌, ఎమ్మెస్సీ/ ఎంసీఏ.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 10-04-2024.

రాత పరీక్ష/ ఇంటర్వ్యూ తేదీ: 01-05-2024.

వెబ్‌సైట్‌: https://www.iittp.ac.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని