నోటిఫికేషన్స్‌

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌- ‘బి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌), గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌), ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 24 Mar 2024 00:37 IST

గవర్నమెంట్‌ జాబ్స్‌
బీఎస్‌ఎఫ్‌లో వివిధ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌- ‘బి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌), గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌), ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) పోస్టుల భర్తీకి అర్హులైన పురుష, మహిళా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

మొత్తం పోస్టులు: 82


బీఎస్‌ఎఫ్‌లో ఇంజినీరింగ్‌ సెటప్‌ (గ్రూప్‌ బి) పోస్టులు

మొత్తం పోస్టులు: 22.

1. సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (వర్క్స్‌): 13 పోస్టులు
2. జూనియర్‌ ఇంజినీర్‌/ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ (ఎలక్ట్రికల్‌): 09 పోస్టులు

అర్హత: డిప్లొమా (సివిల్‌/ ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 30 సంవత్సరాలు మించకూడదు.
జీత భత్యాలు: నెలకు రూ.35,400 - రూ.1,12,400.


ఇంజినీరింగ్‌ సెటప్‌ గ్రూప్‌ సి పోస్టులు

మొత్తం పోస్టులు: 38.

1. హెడ్‌ కానిస్టేబుల్‌ (ప్లంబర్‌): 01 పోస్టు
2. హెడ్‌ కానిస్టేబుల్‌ (కార్పెంటర్‌): 01 పోస్టు
3. కానిస్టేబుల్‌ (జనరేటర్‌ ఆపరేటర్‌): 13 పోస్టులు
4. కానిస్టేబుల్‌ (జనరేటర్‌ మెకానిక్‌): 14 పోస్టులు
5. కానిస్టేబుల్‌ (లైన్‌మ్యాన్‌): 09 పోస్టులు

అర్హత: పోస్టును అనుసరించి మెట్రిక్యులేషన్‌, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు హెడ్‌ కానిస్టేబుల్‌కు రూ.25,500-81,100; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.


ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌-సి పోస్టులు

మొత్తం పోస్టులు: 22.

1. అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ (ఏఏఎం) - ఏఎస్‌ఐ: 08 పోస్టులు
2. అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ (ఏఆర్‌ఎం) - ఏఎస్‌ఐ: 11 పోస్టులు
3. కానిస్టేబుల్‌ (స్టోర్‌మెన్‌): 03 పోస్టులు
ట్రేడ్స్‌: మెకానికల్‌, ఏవియానిక్స్‌.

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయోపరిమితి: ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. కానిస్టేబుల్‌ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.
జీత భత్యాలు: నెలకు ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు రూ.29,200-92,300; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.
ఎంపిక విధానం: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/

మరిన్ని నోటిఫికేషన్ల కోసం క్యూఆర్‌ కోడ్‌ స్కాన్‌ చేయండి..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు