ప్రభుత్వ ఉద్యోగాలు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) 22 పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Updated : 25 Mar 2024 00:18 IST

బీఎస్‌ఎఫ్‌లో ఎయిర్‌ వింగ్‌ పోస్టులు

కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, డైరెక్టరేట్‌ జనరల్‌ బోర్డర్‌ సెక్యూరిటీ ఫోర్స్‌ ఎయిర్‌ వింగ్‌ గ్రూప్‌- ‘సి’ (నాన్‌ గెజిటెడ్‌ నాన్‌ మినిస్టీరియల్‌) 22 పోస్టుల భర్తీకి పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

అసిస్టెంట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెకానిక్‌ (ఏఎస్‌ఐ): 08

అసిస్టెంట్‌ రేడియో మెకానిక్‌ (ఏఎస్‌ఐ): 11

కానిస్టేబుల్‌ (స్టోర్‌మెన్‌): 03

ట్రేడ్స్‌: మెకానికల్‌, ఏవియానిక్స్‌.

అర్హత: పదో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమాతో పాటు పని అనుభవం. నిర్దిష్ట శారీరక ప్రమాణాలు ఉండాలి.

వయసు: ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు 28 ఏళ్లు మించకూడదు. కానిస్టేబుల్‌ పోస్టులకు 20 నుంచి 25 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు ఏఏఎం/ ఏఆర్‌ఎం ఖాళీలకు రూ.29,200-92,300; కానిస్టేబుల్‌ పోస్టులకు రూ.21,700-69,100 చెల్లిస్తారు.

ఎంపిక: రాత పరీక్ష, ఫిజికల్‌ స్టాండర్డ్స్‌ టెస్ట్‌, ఫిజికల్‌ ఎఫిషియెన్సీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.147.20 (ఎస్సీ, ఎస్టీ, మహిళ, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంటుంది).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 15-04-2024.

వెబ్‌సైట్‌: https://rectt.bsf.gov.in/


రాయ్‌పుర్‌ ఎయిమ్స్‌లో ఫ్యాకల్టీ  

రాయ్‌పుర్‌లోని ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌.. శాశ్వత ప్రాతిపదికన 129 బ్యాక్‌లాగ్‌ ఖాళీల భర్తీకి ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ/ దివ్యాంగ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

1. ప్రొఫెసర్‌    2. అడిషనల్‌ ప్రొఫెసర్‌

3. అసోసియేట్‌ ప్రొఫెసర్‌ 4. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌

విభాగాలు: అనస్తీషియాలజీ, అనాటమీ, బయోకెమిస్ట్రీ, బర్న్స్‌ అండ్‌ ప్లాస్టిక్‌ సర్జరీ, కార్డియాలజీ, కార్డియోథొరాసిక్‌ సర్జరీ, క్లినికల్‌ హెమటాలజీ, డెర్మటాలజీ, ఎండోక్రైనాలజీ అండ్‌ మెటబాలిజం, ఈఎన్‌టీ, జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, హాస్పిటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ తదితరాలు.

అర్హతలు: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో మెడికల్‌ పీజీ, ఎండీ, ఎంఎస్‌, ఎంసీహెచ్‌, డీఎం, డాక్టరేట్‌ డిగ్రీతో పాటు బోధన/ పరిశోధనానుభవం.

వయసు: ప్రొఫెసర్‌/ అడిషనల్‌ ప్రొఫెసర్‌ పోస్టుకు 58 ఏళ్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్‌/ అసిస్టెంట్‌  ప్రొఫెసర్‌ పోస్టులకు 50 ఏళ్లు మించకూడదు.

ఎంపిక: విద్యార్హతలు, అనుభవం, ఇంటర్వ్యూ, సర్టిఫికెట్ల తనిఖీ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌లకు ఫీజు లేదు. మిగతావారందరికీ రూ.3000.

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 21-04-2024.

వెబ్‌సైట్‌:  https://www.aiimsraipur.edu.in/user/vacancies.php   


ప్రవేశాలు

ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్‌ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరం సెల్ఫ్‌ సపోర్ట్‌ విధానంలో వివిధ ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏయూ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (ఆఈట్‌ 2024) ప్రకటన విడుదలైంది.

బ్రాంచీలవారీగా సీట్ల వివరాలు

బీటెక్‌- సీఎస్‌ఈ: 360

బీటెక్‌- ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ఇంజినీరింగ్‌: 60

బీటెక్‌- మెకానికల్‌ ఇంజినీరింగ్‌: 30  

బీటెక్‌- సివిల్‌ ఇంజినీరింగ్‌: 30

బీటెక్‌- ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌: 30  

అర్హత: కనీసం 45% మార్కులతో గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ సబ్జెక్టుల్లో 10+2  (రిజర్వ్‌డ్‌ కేటగిరీ అభ్యర్థులకు 40% ఉంటే చాలు).

సీట్ల కేటాయింపు: ప్రవేశ పరీక్ష ఆధారంగా.

పరీక్ష కేంద్రాలు: విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, రాజమహేంద్రవరం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, కడప.

దరఖాస్తు రుసుము: రూ.1,200 (ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగ అభ్యర్థులకు రూ.1000).

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 24-04-2024.

రూ.750 ఆలస్య రుసుముతో దరఖాస్తుకు చివరి తేదీ: 01-05-2024.

హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ ప్రారంభం: 03-05-2024.

ప్రవేశ పరీక్ష తేదీ: 05-05-2024.

ఫలితాల విడుదల: 07-05-2024.

వెబ్‌సైట్‌: https://audoa.andhrauniversity.edu.in/default1.aspx?CET=EET


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని