నోటీస్‌బోర్డు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Published : 24 Jul 2019 01:11 IST

ప్రభుత్వ ఉద్యోగాలు

ఎస్‌బీఐలో ఎస్‌సీఓ పోస్టులు

ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * స్పెషలిస్ట్‌ కేడర్‌ ఆఫీసర్‌ పోస్టులు
మొత్తం ఖాళీలు: 76 పోస్టులు-ఖాళీలు: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ (క్యాపిటల్‌ ప్లానింగ్‌)-01, ఎస్‌ఎంఈ క్రెడిట్‌ అనలిస్ట్‌ (సెక్టర్‌ స్పెషలిస్ట్‌)-25, క్రెడిట్‌ అనలిస్ట్‌-50.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్‌, బీఈ/ బీటెక్‌, ఎంబీఏ, సీఏ/ సీఎఫ్‌ఏ/ పీజీడీఎం ఉత్తీర్ణత, అనుభవం.
వయసు: 23-35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరితేది: ఆగస్టు 12. వెబ్‌సైట్‌:https://bank./sbi/

యూఓహెచ్‌లో ఫ్యాకల్టీ పోస్టులు

యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ (యూఓహెచ్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ఫ్యాకల్టీ పోస్టులు
మొత్తం ఖాళీలు: 121 పోస్టులు-ఖాళీలు: ప్రొఫెసర్‌-36, అసోసియేట్‌ ప్రొఫెసర్‌-55, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-30.
విభాగాలు: సైన్సెస్‌, హ్యుమానిటీస్‌, ఎకనమిక్స్‌, సోషల్‌ సైన్సెస్‌, ఆర్ట్స్‌, మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌. సబ్జెక్టులు: మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌, ఫిజిక్స్‌, తెలుగు, హిందీ, ఉర్దూ, ఎకనమిక్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, డ్యాన్స్‌, మ్యూజిక్‌, తదితరాలు.
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ (నెట్‌/ సెట్‌/ స్లెట్‌), పీహెచ్‌డీ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌. ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: జులై 25 నుంచి ఆగస్టు 26 వరకు. దరఖాస్తు హార్డ్‌కాపీలను పంపడానికి చివరితేది: ఆగస్టు 31.
వెబ్‌సైట్‌:https://www.uohyd.ac.in/

జిప్‌మర్‌లో టీచింగ్‌ పోస్టులు

భారత ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు చెందిన పుదుచ్చేరిలోని జవహర్‌లాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పోస్టుగ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (జిప్‌మర్‌) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.* టీచింగ్‌ పోస్టులు (ప్రొఫెసర్‌-19, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌-24) మొత్తం ఖాళీలు: 43 విభాగాలు: అనాటమీ, అనస్తీషియాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మెడికల్‌ సర్వీస్‌, మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ టెలీ మెడిసిన్‌, తదితరాలు. అర్హత: సంబంధిత స్పెషలైజేషన్‌లో మాస్టర్స్‌ డిగ్రీ, టీచింగ్‌ అనుభవం. ఎంపిక విధానం: : షార్ట్‌లిస్టింగ్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్‌/ ఆఫ్‌లైన్‌. చివరితేది: ఆగస్టు 30. http://www.jipmer.edu.in/

వాక్‌-ఇన్స్‌
ఎన్‌సీఎస్‌సీఎంలో ప్రాజెక్ట్‌ స్టాఫ్‌

చెన్నైలోని నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌ (ఎన్‌సీఎస్‌సీఎం) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.

* ప్రాజెక్ట్‌ స్టాఫ్‌ మొత్తం ఖాళీలు: 30 పోస్టులు: ప్రాజెక్ట్‌ సైంటిస్ట్‌, ప్రాజెక్ట్‌ అసోసియేట్‌, రిసెర్చ్‌, ఫైనాన్స్‌ అసిస్టెంట్‌, అడ్మినిస్ట్రేటివ్‌ అసిస్టెంట్‌, టెక్నికల్‌ ఇంజినీర్‌, టెక్నికల్‌ అసిస్టెంట్‌.
అర్హత: సంబంధిత సబ్జెక్టులో గ్రాడ్యుయేషన్‌, బీటెక్‌, పోస్టు గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత, అనుభవం. వాక్‌ఇన్‌తేది: ఆగస్టు 6
వేదిక: నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సస్టైనబుల్‌ కోస్టల్‌ మేనేజ్‌మెంట్‌, అన్నా యూనివర్సిటీ క్యాంపస్‌, చెన్నై-600025.
వెబ్‌సైట్‌: http://www.ncscm.res.in/

అప్రెంటిస్‌షిప్‌

ఓఎన్‌జీసీలో అప్రెంటిస్‌ ఖాళీలు

ముంబయిలోని ఆయిల్‌ అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఓఎన్‌జీసీ) కింది ట్రేడ్‌లలో అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. * అప్రెంటిస్‌ మొత్తం ఖాళీలు: 214 ట్రేడ్‌లు: అకౌంటెంట్‌, అసిస్టెంట్‌ హెచ్‌ఆర్‌, సెక్రటేరియల్‌ అసిస్టెంట్‌, తదితరాలు.అర్హత: : ఇంటర్మీడియట్‌, సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ, బ్యాచిలర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వయసు: 18-24 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా. దరఖాస్తు: ఆఫ్‌లైన్‌.
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం:  జులై 23 నుంచి ఆగస్టు 5 వరకు. వెబ్‌సైట్‌: https://www.ongcindia.com/

 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని