కామన్వెల్త్‌ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లు

అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన కామన్వెల్త్‌ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేయడానికి కామన్వెల్త్‌ దేశాల...

Published : 23 Oct 2018 09:13 IST

కామన్వెల్త్‌ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లు

 

అంతర్జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన కామన్వెల్త్‌ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌లకు నోటిఫికేషన్‌ విడుదలైంది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌లోని విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీ చేయడానికి కామన్వెల్త్‌ దేశాల విద్యార్థులకు బ్రిటన్‌ ప్రభుత్వం ఈ స్కాలర్‌షిప్‌లను అందిస్తోంది. యూకే డిపార్ట్‌మెంట్‌ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌ (డీఎఫ్‌ఐడీ) వీటికి నిధులను సమకూరుస్తుంది. కామన్వెల్త్‌ దేశాల్లో అకడమిక్‌, ఇతర రంగాల్లో సంస్థాగత సామర్థ్యాన్ని పెంపొందించడం, వ్యక్తిగత శిక్షణ, పరిశోధనా సామర్థ్యాన్ని అభివృద్ధి చేసే ఉద్దేశంతో ఈ స్కాలర్‌షిప్‌లను ప్రవేశపెట్టారు. 
దరఖాస్తుదారులు కామన్వెల్త్‌ దేశాల పౌరులై  ఉండాలి. సెప్టెంబరు/ అక్టోబరు 2019 నుంచి ప్రారంభమయ్యే యూకే విద్యా సంవత్సరంలో మాస్టర్స్‌ డిగ్రీ చదవడానికి ప్రవేశం పొంది ఉండాలి. ఈ నిర్ణీత సమయం కంటే ముందు పీహెచ్‌డీలో లేదా ఎంఫిల్‌లో ప్రవేశం పొందినవారు అనర్హులు. అలాగే స్వదేశంలోగానీ మరే ఇతర దేశంలోనైనా పీహెచ్‌డీ కోసం నమోదు చేసుకుని ఉండకూడదు. కామన్వెల్త్‌ పీహెచ్‌డీ స్కాలర్‌షిప్‌ కోసం కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ద్వారా దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. నేషనల్‌ నామినేటింగ్‌ ఏజెన్సీ (మన దేశంలో ఎంహెచ్‌ఆర్‌డీ ఈ బాధ్యత నిర్వర్తిస్తుంది. 
వెబ్‌సైట్‌: www.mhrd.gov.in ద్వారా అందిన దరఖాస్తులను కామన్వెల్త్‌ స్కాలర్‌షిప్‌ కమిషన్‌ పరిశీలించి అర్హులను ఎంపిక చేస్తుంది. అభ్యర్థుల అకడమిక్‌ మెరిట్‌, రిసెర్చ్‌ ప్రతిపాదనలోని నాణ్యత, అభ్యర్థుల స్వదేశంపై అది చూపే ప్రభావం ఆధారంగా ఎంపిక చేస్తారు. 
చివరి తేది: 19 డిసెంబరు 2018 
వెబ్‌సైట్‌: 
www.acu.ac.uk/scholarships/commonwealth-scholarships


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని