నోటీసు బోర్డు

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన సనత్‌నగర్‌ (హైదరాబాద్‌)లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

Updated : 31 Mar 2022 05:56 IST

ఉద్యోగాలు

ఈఎస్‌ఐసీ, హైదరాబాద్‌లో...

భారత ప్రభుత్వ కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖకు చెందిన సనత్‌నగర్‌ (హైదరాబాద్‌)లోని ఎంప్లాయీస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఈఎస్‌ఐసీ) మెడికల్‌ కాలేజ్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 311 పోస్టులు: ఫ్యాకల్టీ, సూపర్‌ స్పెషలిస్టులు, జూనియర్‌ కన్సల్టెంట్లు, సీనియర్‌ రెసిడెంట్లు, రిసెర్చ్‌ సైంటిస్టులు తదితరాలు అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్‌, ఎమ్మెస్సీ, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ/ పీజీ డిప్లొమా (ఎండీ/ ఎంఎస్‌/ పీహెచ్‌డీ) ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌, టీచింగ్‌ అనుభవం, నీట్‌ స్కోర్‌ (2021) ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 03. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 17.
వెబ్‌సైట్‌: www.esic.nic.in/


ఉస్మానియా మెడికల్‌ కాలేజీ/ హాస్పిటల్‌లో...

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన హైదరాబాద్‌లోని ఉస్మానియా మెడికల్‌ కాలేజ్‌/ ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నాయి.
మొత్తం ఖాళీలు: 135 పోస్టులు- ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-115, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు-20. విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఓబీజీ, పీడియాట్రిక్స్‌, ఆర్థోపెడిక్స్‌, అనెస్థీషియా. అర్హత: పోస్టుల్ని అనుసరించి ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ ఉత్తీర్ణత. ఏపీ/తెలంగాణ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ మార్కుల ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా. చిరునామా: ప్రిన్సిపల్‌, ఓయూ మెడికల్‌ కాలేజ్‌, హైదరాబాద్‌-500095. చివరితేది: 2022, ఏప్రిల్‌ 04.

వెబ్‌సైట్‌: http://osmaniamedicalcollege.org/


ఈఐఎల్‌లో 60 పోస్టులు

భారత ప్రభుత్వరంగానికి చెందిన న్యూదిల్లీలోని ఇంజినీర్స్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈఐఎల్‌) వివిధ విభాగాల్లో కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
 జూనియర్‌ డ్రాఫ్ట్స్‌మెన్లు  మొత్తం ఖాళీలు: 60 విభాగాలు:  స్ట్రక్చరల్‌, మెకానికల్‌, సివిల్‌, ఎలక్ట్రికల్‌, కెమికల్‌, ఇన్‌స్ట్రుమెంటేషన్‌ తదితరాలు. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 2022, ఏప్రిల్‌ 01. దరఖాస్తులకు చివరి తేది: 2022, ఏప్రిల్‌ 18.

వెబ్‌సైట్‌: https://engineersindia.com/


బెల్‌లో ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ (బెల్‌) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
* ప్రాజెక్ట్‌ ఇంజినీర్లు మొత్తం ఖాళీలు: 13 అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం. వయసు: 32 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎంపిక విధానం: బీఈ/బీటెక్‌ మెరిట్‌ మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.
వెబ్‌సైట్‌: www.bel-india.in/


వాక్‌ఇన్‌

రిమ్స్‌, ఆదిలాబాద్‌లో...

తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ఆదిలాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (రిమ్స్‌) ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 70 పోస్టులు-ఖాళీలు: అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు-60, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు-10. విభాగాలు: జనరల్‌ మెడిసిన్‌, జనరల్‌ సర్జరీ, ఆబ్‌స్టెట్రిక్స్‌ గైనకాలజీ, పీడియాట్రిక్స్‌ తదితరాలు. అర్హత: ఎంబీబీఎస్‌, సంబంధిత స్పెషలైజేషన్లలో మెడికల్‌ పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్‌/ డీఎన్‌బీ) ఉత్తీర్ణత. టీఎస్‌ మెడికల్‌ కౌన్సిల్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. వయసు: 18 నుంచి 44 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ మార్కులు, అనుభవం, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ఆధారంగా. వాక్‌ఇన్‌ తేది: 2022, ఏప్రిల్‌ 11. వేదిక: రిమ్స్‌ మెడికల్‌ కాలేజ్‌, ఆదిలాబాద్‌, తెలంగాణ.

http://rimsadilabad.in/


ఈసీఐఎల్‌లో 19 పోస్టులు

హైదరాబాద్‌ ప్రధానకేంద్రంగా ఉన్న  ఎలక్ట్రానిక్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (ఈసీఐఎల్‌) దేశవ్యాప్తంగా ఉన్న వివిధ యూనిట్లలో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టులకు వాక్‌ఇన్‌ నిర్వహిస్తోంది.
మొత్తం ఖాళీలు: 19 పోస్టులు-ఖాళీలు: టెక్నికల్‌ ఆఫీసర్లు-13, సైంటిఫిక్‌ అసిస్టెంట్లు-04, సీనియర్‌ ఆర్టిజన్‌-01, జూనియర్‌ ఆర్టిజన్‌-01. అర్హత: పోస్టుల్ని అనుసరించి ఐటీఐ, సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్‌ డిప్లొమా, బీఈ/ బీటెక్‌ ఉత్తీర్ణత, అనుభవం. ఎంపిక విధానం: వాక్‌ఇన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా. వాక్‌ఇన్‌ తేది: 2022, ఏప్రిల్‌ 12. వేదిక: సంబంధిత ఈసీఐఎల్‌ రీజినల్‌ కార్యాలయాల్లో నిర్వహిస్తారు. 

వెబ్‌సైట్‌:https://www.ecil.co.in/


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని