జనరల్‌ సైన్స్‌ - బయాలజీ

జీవులన్నీ కింది ఏ కార్బోహైడ్రేట్‌ను నేరుగా శ్వాసక్రియలో ఉపయోగించుకుంటాయి?

Published : 22 Jun 2022 01:49 IST

ప్రాక్టీస్‌ బిట్లు

1. జీవులన్నీ కింది ఏ కార్బోహైడ్రేట్‌ను నేరుగా శ్వాసక్రియలో ఉపయోగించుకుంటాయి?
1) గ్లూకోజ్‌ 2) స్టార్చ్‌ 3) ఫ్రక్టోజ్‌ 4) సెల్యులోజ్‌
2. ఏ కార్బోహైడ్రేట్‌ను జంతువుల్లో నిల్వ ఉండే పిండిపదార్థం అంటారు?
  1) పిండిపదార్థం 2) గ్లైకోజన్‌ 3) ఇన్యులిన్‌ 4) ఇన్సులిన్‌
3. పాలలోని లాక్టోజ్‌లో ఏ చక్కెరలు అంతర్భాగంగా ఉంటాయి?
  1) గ్లూకోజ్‌, ఫ్రక్టోజ్‌   2) గ్లూకోజ్‌, సుక్రోజ్‌
  3) గ్లూకోజ్‌, గాలక్టోజ్‌   4) లాక్టోజ్‌, మాల్టోజ్‌

4. కేంద్రకామ్లాల్లో ఉండే పెంటోజ్‌ చక్కెరకు ఉదాహరణ?
  1) అరాబినోజ్‌  2) గ్జైలోజ్‌   3) ఫ్రక్టోజ్‌  4) రైబోజ్‌
5. గ్లూకోజ్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది?
  1) గ్లూకోజ్‌ హెక్సోజ్‌ చక్కెరకు ఉదాహరణ.
  2) గ్లూకోజ్‌ను తక్షణ శక్తినిచ్చే చక్కెర అంటారు.
  3) గ్లూకోజ్‌ నేరుగా శ్వాసక్రియలో ఉపయోగపడుతుంది.
  4) పైవన్నీ

6. పత్తిగింజల పిండిలో కింది ఏ చక్కెర ఉంటుంది?
  1) మాల్టోజ్‌ 2) రాఫినోజ్‌ 3) సుక్రోజ్‌ 4) లాక్టోజ్‌
7. ధాన్యాలు, బంగాళదుంప, విత్తనాలు లాంటివాటిలో ఏ హోమో పాలిశాకరైడ్‌ నిల్వ ఉంటుంది?
  1) గ్లైకోజన్‌      2) పిండిపదార్థం
  3) ఇన్యులిన్‌     4) సెల్యులోజ్‌

8. వృక్షరాజ్యంలో నిర్మాణాత్మకంగా భూమిపై అతి ఎక్కువగా ఉండే కార్బోహైడ్రేట్‌?
  1) సెల్యులోజ్‌  2) ఇన్యులిన్‌ 3) అగార్‌ 4) పెక్టిన్‌

సమాధానాలు: 1-1; 2-2; 3-3; 4-4; 5-4; 6-2; 7-2; 8-1


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని