Current affairs: కరెంట్‌ అఫైర్స్‌

దేశీయంగా తయారుచేసిన తొలి విమాన వాహక నౌక ‘విక్రాంత్‌’ను దాని తయారీ సంస్థ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ జులై 28న భారత నౌకాదళానికి అప్పగించింది. దీని పొడవు 262 మీ., వెడల్పు 62 మీ., ఎత్తు 59 మీ., గరిష్ఠ వేగం 28 నాట్‌లు. నిర్మాణ వ్యయం

Updated : 30 Jul 2022 03:56 IST

తొలి దేశీయ విమాన వాహక నౌక ‘విక్రాంత్‌’

దేశీయంగా తయారుచేసిన తొలి విమాన వాహక నౌక ‘విక్రాంత్‌’ను దాని తయారీ సంస్థ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ జులై 28న భారత నౌకాదళానికి అప్పగించింది. దీని పొడవు 262 మీ., వెడల్పు 62 మీ., ఎత్తు 59 మీ., గరిష్ఠ వేగం 28 నాట్‌లు. నిర్మాణ వ్యయం దాదాపు రూ.20 వేల కోట్లు. 88 మెగావాట్ల సామర్థ్యమున్న నాలుగు గ్యాస్‌ టర్బైన్లతో ఇది నడుస్తుంది. 


సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణకు ఉస్మానియా విశ్వవిద్యాలయం (ఓయూ) గౌరవ డాక్టరేట్‌ ఇవ్వనుంది. ఆగస్టు 5న జరగనున్న వర్సిటీ 82వ స్నాతకోత్సవంలో ఈ డాక్టరేట్‌ను ప్రదానం చేస్తారు. తెలుగు వ్యక్తి అయిన జస్టిస్‌ రమణ దేశ సర్వోన్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తిగా 2021 ఏప్రిల్‌ 24 నుంచి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను గౌరవ డాక్టరేట్‌కు ఎంపిక చేస్తూ ఓయూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు ఓయూ 47 మందికి మాత్రమే గౌరవ డాక్టరేట్లు ప్రకటించింది. తొలిసారిగా 1917లో నవాబ్‌ జమాదుల్‌ ముల్క్‌ బహదూర్‌కు ఇచ్చింది.  


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని