పర్యావరణం ప్రాక్టీస్‌ బిట్లు

నీటి కాలుష్యానికి ముఖ్యమైన మానవ కారణాలు?

Published : 03 Aug 2022 02:04 IST

1. నీటి కాలుష్యానికి ముఖ్యమైన మానవ కారణాలు?
  1) మురుగు నీరు  
  2) పారిశ్రామిక వ్యర్థ జలాలు
  3) వ్యవసాయంలో వాడే రసాయనాలు
  4) పైవన్నీ

2. పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో నీటి వనరులు కలుషితమవడానికి కారణం?
  1) కీటక నాశనులు    2) మురుగు నీరు
  3) ఎరువులు   4) రేడియోధార్మిక పదార్థాలు

3. మురుగునీటి కారణంగా తాగునీరు కలుషితమై ఏ అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది?
  1) కలరా 2) డయేరియా  
  3) టైఫాయిడ్‌ 4) పైవన్నీ

4. ఏ కాలుష్య కారకం మన శరీరంలోకి చేరి పక్షవాతం, నాడీ వ్యవస్థ దెబ్బతినడం, అలసట లాంటి లక్షణాలను కలిగిస్తుంది?
1) సీసం  2) రాగి  3) నికెల్‌ 4) మాంగనీస్‌
5. భారతదేశంలోని కొన్ని ప్రాంతాల తాగునీటిలో ఏవి ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు?
  1) ఫ్లోరిన్‌, బ్రోమిన్‌ 2) క్లోరిన్‌, ఫ్లోరిన్‌
  3) ఫ్లోరిన్‌, ఆర్సెనిక్‌ 4) ఆర్సెనిక్‌, అమ్మోనియా

6. ఆర్సెనిక్‌ మన శరీరంలో అధికంగా చేరడం వల్ల కలిగే వ్యాధి?
  1) మూత్రపిండాల వైఫల్యం
  2) బ్లాక్‌ఫూట్‌ వ్యాధి
  3) రక్తపోటు        4) యూరిమియా

7. చెరువులు, సరస్సుల్లో శైవల మంజరులు పెరగడం దేన్ని సూచిస్తుంది?  
  1) జీవైవిధ్యం పెరగడం  
  2) కాలుష్యం పెరగడం
  3) అనుక్రమం జరగడం
  4) కాలుష్యం తగ్గడం


సమాధానాలు: 1-4; 2-2; 3-4; 4-1;  5-3; 6-2; 7-2.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని