ఆస్క్‌ ది ఎక్స్‌పర్ట్‌

నేను ఆచార్య నాగార్జున  యూనివర్సిటీ నుంచి దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాను. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలకు నాకు అర్హత ఉంటుందా? తెలంగాణ స్థానికత వర్తిస్తుందా? ​​​​​​​

Published : 13 Aug 2022 04:20 IST

నేను ఆచార్య నాగార్జున  యూనివర్సిటీ నుంచి దూరవిద్యలో డిగ్రీ పూర్తి చేశాను. టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలకు నాకు అర్హత ఉంటుందా? తెలంగాణ స్థానికత వర్తిస్తుందా? 

- ఒక అభ్యర్థి

జ: మీకు టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాలకు కచ్చితంగా అర్హత ఉంటుంది. ఒకటి నుంచి ఏడో తరగతి వరకు మీరు తెలంగాణలోనే చదివి ఉంటే ఇక్కడి స్థానికత కూడా వర్తిస్తుంది.

నేను డీఎడ్, ఓపెన్‌ డిగ్రీ ఒకే విద్యాసంవత్సరంలో పూర్తి చేశాను. దీని వల్ల గ్రూప్స్‌ సాధనలో ఏమైనా సమస్య ఎదురవుతుందా?

- బాలరాజు

జ: ఎలాంటి సమస్యా ఉండదు. ఏ సందేహాలు లేకుండా గ్రూప్స్‌ పరీక్షలకు బాగా ప్రిపేర్‌ అవ్వండి.

నా దగ్గర ఒకటో తరగతి మినహా మిగిలిన అన్ని స్టడీ సర్టిఫికెట్లు ఉన్నాయి. దీని వల్ల టీఎస్‌పీఎస్సీ ఉద్యోగ సాధనలో స్థానికతకు సంబంధించి ఏదైనా సమస్య ఉంటుందా? 

- ఒక అభ్యర్థి 

జ: ఒకటో తరగతికి సంబంధించి రెసిడెన్షియల్‌ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఒకటో తరగతి చదివి ఉంటే ఆ స్కూల్‌ నుంచి స్టడీ సర్టిఫికెట్‌ తెచ్చుకుంటే ఏ సమస్యా ఉండదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని