కరెంట్‌ అఫైర్స్‌

భగవద్గీత బోధనలకు అనుగుణంగా 260 అడుగుల ఎత్తుతో ఆసియాలోనే తొలి, అతి ఎత్తయిన దేవాలయాన్ని జ్ఞాన్‌ మందిర్‌ పేరిట ఏ రాష్ట్రంలోని కురుక్షేత్ర అనే ప్రాంతంలో

Published : 16 Sep 2022 00:17 IST

మాదిరి ప్రశ్నలు

భగవద్గీత బోధనలకు అనుగుణంగా 260 అడుగుల ఎత్తుతో ఆసియాలోనే తొలి, అతి ఎత్తయిన దేవాలయాన్ని జ్ఞాన్‌ మందిర్‌ పేరిట ఏ రాష్ట్రంలోని కురుక్షేత్ర అనే ప్రాంతంలో నిర్మిస్తున్నారు? 

జ: హరియాణా
2022 బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ క్రీడల్లో తెలంగాణ యువ బాక్సర్‌ నిఖత్‌ జరీన్‌ ఎన్ని కిలోల విభాగంలో స్వర్ణం నెగ్గింది? 

జ: 50 కిలోల విభాగం

ప్రతిష్ఠాత్మక ఎం.ఎస్‌.స్వామినాథన్‌ పురస్కారాన్ని చెన్నైలో 2022, ఆగస్టు 8న ఎవరికి ప్రదానం చేశారు?

జ: తెలంగాణ విత్తనాభివృద్ధి సంస్థ ఎండీ, అంతర్జాతీయ విత్తన పరీక్ష సంఘం (ఇస్టా) ఛైర్మన్‌ డాక్టర్‌ కె.కేశవులు

2026 కామన్వెల్త్‌ క్రీడల వేదిక?

జ: విక్టోరియా, ఆస్ట్రేలియా

తమిళనాడులోని మహాబలిపురంలో నిర్వహించిన 44వ చెస్‌ ఒలింపియాడ్‌లో ఓపెన్‌ కేటగిరిలో వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలు గెలుచుకున్న జట్లు?

జ: ఉక్రెయిన్‌, ఆర్మేనియా, భారత్‌

కేంద్ర పంచాయతీ రాజ్‌, గ్రామీణ అభివృద్ధి శాఖ 2022, జులై 31న విడుదల చేసిన సంసద్‌ ఆదర్శ్‌ గ్రామీణ యోజన (ఎస్‌ఏజీవై) ర్యాంకింగ్‌లో 99.98 పాయింట్లు సాధించి సంయుక్తంగా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ గ్రామాలు?

జ: యాదాద్రి భువనగిరి మండలం వడపర్తి, ఆలేరు మండలం కొలనుపాక


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని