జాగ్రఫీ ప్రాక్టీస్‌ బిట్లు

టెండు ఆకులను వేటి తయారీలో ఉపయోగిస్తారు?

Updated : 17 Sep 2022 06:06 IST

1. టెండు ఆకులను వేటి తయారీలో ఉపయోగిస్తారు?

1) పశువుల దాణా 2) అలంకరణ 3) పర్‌ఫ్యూమ్‌ 4) బీడీలు

2. ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) న్యూదిల్లీ 2) గాంగ్‌టక్‌ 3) దేెహ్రాదూన్‌ 4) గువాహటి

3. మడ అరణ్యాల ప్రత్యేక లక్షణం ఏమిటి?

1) శ్వాస వేర్లతో ఉండటం 2) ఎత్తుగా పెరగడం 3) పెద్ద పెద్ద ఆకులు ఉండటం 4) మెత్తటి కలప చెట్లు

4. ‘పూర్‌ మ్యాన్స్‌ టింబర్‌’ అని దేన్ని పిలుస్తారు?

1) టేకు 2) వెదురు 3) తుమ్మ 4) ఈత

5. భారత్‌లో ఏ రకమైన అడవులు అధికంగా ఉన్నాయి?

1) సతత హరితారణ్యాలు 2) ఆకురాల్చే అడవులు 3) మడ అడవులు 4) ముళ్ల అడవులు

6. రైల్వే స్లీపర్ల తయారీలో ఏ రకమైన కలపను వాడతారు?

1) సాల్‌ 2) ఖైం 3) పామ్‌ 4) మహోగని

7. అకేషియా, కాక్టస్‌ ఏ అడవుల్లోని ప్రధాన వృక్షాలు?

1) అర్ధ సతత హరితారణ్యాలు

2) ఆకురాల్చే అడవులు

3) మడ అరణ్యాలు

4) ముళ్ల అరణ్యాలు

8. ప్రపంచ అటవీ దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

1) మార్చి 21 2) సెప్టెంబరు 21 3) ఫిబ్రవరి 21 4) ఆగస్టు 21

9. భాక్రానంగల్‌ ప్రాజెక్ట్‌ను ఏ నదిపై నిర్మించారు?

1) రావి 2) సట్లెజ్‌ 3) బియాస్‌ 4) జీలం

సమాధానాలు: 1-4; 2-3; 3-1; 4-2; 5-2; 6-1; 7-4; 8-1; 9-2


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని