జాగ్రఫీ ప్రాక్టీస్‌ బిట్లు

1. కిందివాటిలో సరైంది?, ఎ) నైరుతి రుతుపవనాల కారణంగా జూన్‌, జులై నెలల్లో వర్షపాతం అధికంగా ఉంటుంది.

Updated : 19 Sep 2022 06:27 IST

1. కిందివాటిలో సరైంది?
ఎ) నైరుతి రుతుపవనాల కారణంగా జూన్‌, జులై నెలల్లో వర్షపాతం అధికంగా ఉంటుంది.
బి) ఆగస్టులో రుతుపవన వర్షపాతం నిలకడగా ఉంటుంది.
సి) సెప్టెంబరు రెండో వారం తర్వాత రుతుపవనాలు ఉత్తర భారత్‌ నుంచి తిరోగమించడం ప్రారంభిస్తాయి.
డి) రుతుపవన కాలంలో దేశంలో అన్ని ప్రాంతాల్లో వర్షం సంభవించడం వల్ల ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి.
1) ఎ, డి   2) బి, సి   3) ఎ, బి, సి  4) పైవన్నీ
2. తిరోగమన నైరుతి రుతుపవన కాలం ఏ రాష్ట్రానికి ముఖ్యమైన వర్షాకాలం?
1) తమిళనాడు   2) ఉత్తర్‌ప్రదేశ్‌    
3) ఈశాన్య రాష్ట్రాలు   4) మహారాష్ట్ర
3. పురోగమించే చల్లని పొడి పవనాలు, తిరోగమించే వెచ్చని పవనాలు కలిసిన వాతాగ్రం వద్ద ఏర్పడేది?
1) అల్పపీడనం   2) అధిక పీడనం  
3) తుపానులు   4) చిరుగాలులు
4. అధిక ఉష్ణోగ్రతలు ఉండే వేసవి కాలంలో సంభవించే వర్షపాతాన్ని ఏమంటారు?
1) పర్వతీయ వర్షం   2) చక్రవాత వర్షం    
3) సంవహన వర్షం   4) ఏదీకాదు
5. భారతదేశంలో అత్యధిక వర్షపాతం ఎక్కడ సంభవిస్తుంది?
1) పడమటి కనుమల పశ్చిమ తీరప్రాంతం
2) ఈశాన్య అస్సాం కొండలు, తూర్పు హిమాలయాలు
3) 1, 2    4) 1 మాత్రమే

సమాధానాలు: 1-4; 2-1; 3-3; 4-3; 5-3.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని