నలుగురితో కలుపుగోలుగా!
విద్యార్థులందరూ ఒకేలా ఉండరు కదా... కొందరు త్వరగా నలుగురితో కలిసిపోతారు. మరికొందరు కలవలేరు.
విద్యార్థులందరూ ఒకేలా ఉండరు కదా... కొందరు త్వరగా నలుగురితో కలిసిపోతారు. మరికొందరు కలవలేరు. ఇకొత్తవారితో మాట్లాడాలంటే వీరికి విపరీతమైన మొహమాటం, బిడియం. దీంతో పరిచయాలనూ పెంచుకోలేక ఇబ్బందిపడుతుంటారు.
నలుగురితో కలిసి పనిచేయడమనేది విద్యార్థులకు తప్పనిసరిగా ఉండాల్సిన నైపుణ్యం. రికార్డులు రాయడం, అసైన్‌మెంట్లు, ప్రాజెక్టు వర్క్‌లు పూర్తిచేయడం లాంటివన్నీ కలసికట్టుగానే చేయాలి.
* తరగతిలో చివరి బెంచీలో కూర్చుని ఏదో బలవంతాన వచ్చామా.. వెళ్లామా అన్నట్టుగా ఉండకూడదు. తోటి విద్యార్థులతో మెల్లగా మాటలు కలపాలి. అవి పాఠాలు, అసైన్‌మెంట్లు, పరీక్ష తేదీలు.. వీటికి సంబంధించిన సందేహాలైనా కావచ్చు. వీటిని మనసులోనే పెట్టుకుని ఇబ్బందిపడకుండా అడగడం వల్ల పరిచయాలూ పెరుగుతాయి. ఆ తర్వాత కొంతకాలానికి అది స్నేహంగానూ మారొచ్చు.
* తరగతులు అయిపోగానే తిన్నగా ఇంటికి లేదా హాస్టల్‌కు వెళ్లకూడదు. మీకు ఆసక్తి ఉన్న క్రీడను సాధన చేయొచ్చు. అభిరుచులను కొనసాగించడం వల్లా పరిచయాలు పెరుగుతాయి. ఉదాహరణకు మీకు పుస్తకాలు చదివే అలవాటు ఉంటే లైబ్రరీకి వెళతారు. అక్కడి పుస్తక ప్రియులతో మీకు పరిచయం కలగొచ్చు.
* మీ స్నేహితులు వారి పరిచయస్తులతో బయటకు వెళుతుంటే మీరూ వారి వెంట వెళ్లొచ్చు. దీంతో కొత్తవారితో మీకూ పరిచయం అవుతుంది. మీ అంతట మీరుగా ఇతరులతో కలవలేనప్పుడు ఈ పద్ధతి వల్ల లాభం ఉంటుంది.
* మీ అభిరుచులకు అనుగుణంగా బృందంగా ఏర్పడి వ్యాసరచన, క్విజ్, వక్తృత్వ పోటీల్లో పాల్గొనవచ్చు. ఇలా చేయడం వల్ల నలుగురితో మాట్లాడటం, ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లగలిగే నేర్పు అలవడుతుంది.
* సమస్య మన ఒక్కరికే ఉందని సరిపెట్టుకోకూడదు. ఇదే సమస్యను తోటి విద్యార్థులు, సీనియర్లు ఎలా పరిష్కరించుకున్నారో తెలుసుకోవాలి. వారి అనుభవాల నుంచి కూడా పరిష్కారాలను తెలుసుకోవచ్చు.
* కొన్ని విద్యాసంస్థల్లో కౌన్సెలింగ్ సేవలూ అందుబాటులో ఉంటాయి. వారి సహకారంతో ఒంటరితనం, ఆందోళన, ఒత్తిడి.. లాంటి సమస్యలను అధిగమించే మార్గాల గురించీ తెలుసుకోవచ్చు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sudhamurthy: నా పేరును దుర్వినియోగం చేస్తున్నారు.. పోలీసులకు సుధామూర్తి ఫిర్యాదు
-
Raghava Lawrence: ఆయన లేకపోతే ఈ వేదికపై ఉండేవాణ్ని కాదు: లారెన్స్
-
Mla Rajaiah: కాలం నిర్ణయిస్తే బరిలో ఉంటా: ఎమ్మెల్యే రాజయ్య
-
Khammam: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పద మృతి.. కళాశాల వద్ద ఉద్రిక్తత
-
IND vs AUS: ఆసీస్‌పై ఆల్‌రౌండ్ షో.. టీమ్ఇండియా ఘన విజయం
-
Bennu: నాసా ఘనత.. భూమి మీదికి గ్రహశకలం నమూనాలు!