తెరను ఎక్కువగా చూడాల్సి వస్తే..

ఇప్పుడు విద్యార్థులు చదువుకునేటప్పుడు ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ తెరలను చూడాల్సి రావడం చాలా సాధారణం. మెటీరియల్‌, తరగతులు, సందేహాల నివృత్తి కోసం వీటిపై ఆధారపడుతుంటారు.

Published : 30 Nov 2022 10:03 IST

ఇప్పుడు విద్యార్థులు చదువుకునేటప్పుడు ఫోన్‌, ల్యాప్‌టాప్‌, కంప్యూటర్‌ తెరలను చూడాల్సి రావడం చాలా సాధారణం. మెటీరియల్‌, తరగతులు, సందేహాల నివృత్తి కోసం వీటిపై ఆధారపడుతుంటారు. అయితే గంటల తరబడి చూసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. అవేంటంటే..

💻 కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ వంటి వాటిని కనీసం 20 నుంచి 40 అంగుళాల దూరంలో ఉంచాలి. అంటే మీరు చేయిచాచితే మునివేళ్లు మాత్రమే తాకేంత దూరంలో ఉండాలి. స్క్రీన్‌ టాప్‌ మన కంటికి సమాంతరంగా లేదా కిందకు ఉండాలి. దీని వల్ల కళ్లపైన ఒత్తిడి తగ్గడమే కాకుండా సరైన భంగిమలో కూర్చునే అవకాశం ఉంటుంది.

💻 స్క్రీన్‌ సెట్టింగ్స్‌లో గ్లేర్‌, కాంట్రాస్ట్‌, బ్రైట్‌నెస్‌ తక్కువగా ఉండాలి. బాగా వెలుతురు జిమ్మే తెర వల్ల నీలికిరణాలు వెలువడతాయి. అవి కంటిచూపును దెబ్బతీస్తాయి. అక్షరాలు చదివేటప్పుడు మరీ చిన్నవి కాకుండా వీలైనంత పెద్దగా ఉంచడం వల్ల అనవసరమైన ఒత్తిడి తగ్గుతుంది.

💻 తెరను చూసేటప్పుడు లైట్‌ మన తలపైగానీ, వెనుకవైపు నుంచీ కానీ రాకుండా... తెర వెనక వైపు ఉండాలి. దానివల్ల తెరపై అధిక వెలుతురు పడకుండా హాయిగా ఉంటుంది.

💻 అలాగే ప్రతి 20 నిమిషాలకు ఒకసారి తప్పకుండా తెర నుంచి పక్కకు చూడాలి. కళ్లు అలసిపోయినట్లు అనిపిస్తే చల్లటి నీటితో ముఖం కడుక్కోవడం వల్ల కంటి కండరాలపై ఒత్తిడి తగ్గుతుంది.

💻 వీలైనంతగా తెరను చూసే సమయం తగ్గించాలి. తప్పదు అనుకుంటే కళ్లపై ఒత్తిడి పడకుండా నిరోధించే కళ్లద్దాలు ధరించవచ్చు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని